ఇలాంటి మోడిఫైడ్ వ్యాగన్ఆర్ కార్లను ఎప్పుడైనా చూశారా...?

కార్ల తయారీ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయే విధంగా వ్యాగన్ఆర్ కార్లను అత్యంత అదంగా మోడిఫై చేసారు. డ్రైవ్‌స్పార్క్ తెలుగులో మోస్ట్ బ్యూటిఫుల్ మోడిఫైడ్ వ్యాగన్ఆర్ కార్ల గురించి పూర్తి వివరాలు...

By Anil

ఇండియన్ రోడ్లను శాసిస్తున్న కార్లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒక ముఖ్యమైన కారు. ఇది భారత్‌లోకి ప్రవేశించి సుమారుగా 17 ఏళ్లు కావస్తోంది. అయినప్పటికీ దీనిని ప్రేమించే వాళ్లు, దీని కొనుగోళ్లు ఏ మాత్రం తగ్గలేదు. సాధారణ వ్యాగన్ఆర్ కార్లే కాదు మోడిఫైడ్ వ్యాగన్‌ఆర్ కారు ప్రేమికులు కూడా భారీగా ఉన్నారు.

కార్ల తయారీ కంపెనీలు సైతం ఆశ్చర్యపోయే విధంగా వ్యాగన్ఆర్ కార్లను అత్యంత అదంగా మోడిఫై చేసారు. డ్రైవ్‌స్పార్క్ తెలుగులో మోస్ట్ బ్యూటిఫుల్ మోడిఫైడ్ వ్యాగన్ఆర్ కార్ల గురించి పూర్తి వివరాలు...

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

రెడ్ డెవిల్ వ్యాగన్ఆర్

చూడటానికి చాలా సింపుల్‌గా ఉంది కదూ... కాని బాగా తీక్షణంగా చూస్తే ఇందులో మోడిఫికేషన్ ప్రతిభ బయటపడుతుంది. మారుతి అందించిన ఫ్రంట్ గ్రిల్ స్థానంలో సరికొత్త బ్లాక్ గ్రిల్ వచ్చింది. మునుపటి హెడ్ లైట్లను మార్చేస్తూ పెద్ద పరిమాణంలో ఉన్న బ్లాక్ఔట్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

బ్లడ్ రెడ్ కలర్‌లో ఉన్న వ్యాగన్ఆర్‌లో ఫ్రంట్ బంపర్ లిప్, బంపర్‌లో కూడా హెడ్ ల్యాంప్స్, విశాలమైన టైర్లు, మరియు నూతన స్పోక్స్ అల్లాయ్ వీల్స్ గల బాడీ కట్ కలదు.

Recommended Video

Mahindra KUV100 NXT Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

వైట్ బ్రైడ్ వ్యాగన్ఆర్

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఎంచుకుంటున్న వైట్ కలర్‌లోనే వ్యాగన్ఆర్‌ను విభిన్నంగా మోడిఫై చేశారు. నీలి రంగు కళ్లను పోలి ఉన్న హెడ్ ల్యాంప్స్ మొత్తం మోడిఫికేషన్‌లో హైలెట్‌గా నిలిచాయి.

సరికొత్త లోయర్ ఫ్రంట్ బంపర్, నూతన ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే నీలి రంగు ఎల్ఇడి లైట్లతో కూడిన పెద్ద ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

రఫ్ రోడ్ ఫ్రెండ్లీ వ్యాగన్ఆర్

తారు రోడ్డు మీద వ్యాగన్ఆర్ మృదువైన రైడింగ్ కల్పిస్తుంది. అయితే రఫ్ రోడ్ల మీద కాస్త ఇబ్బందులు ఎదుర్కుంటుంది. ఢిల్లీ చెందిన ఓ వ్యక్తి తన వ్యాగన్ఆర్ కారును ప్రత్యేకించి ఆఫ్ రోడింగ్ కోసం వ్యాగన్ఆర్‌ను మోడిఫై చేయించాడు.

రెగ్యులర్ వ్యాగన్ఆర్‌తో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు ఆఫ్ రోడ్ వెర్షన్ వ్యాగన్‌ఆర్‌లో అప్‌గ్రేడెడ్ ఎల్ఇడి లైట్లు, సరికొత్త ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్, మరియు వీల్ ఆర్చెస్‌తో పాటు కొన్ని ఇతర మార్పులు జరిగాయి.

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

స్పోర్టి వ్యాగన్ఆర్

ఒక్కో అభిరుచి ఒక విధంగా ఉంటుంది. ఓ వ్యాగన్ఆర్ ప్రేమికుడు తన అభిరుచికి అనుగుణంగా వ్యాగన్ఆర్‌ను స్పోర్టి శైలిలో మోడిఫై చేయించాడు. స్పోర్టివ్ లుక్ సొంతం చేసుకునేందుకు ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు జరిగాయి. దీనికి తోడుగా టైప్ఆర్(TypeR) బ్యాడ్జ్‌ను కూడా జోడించారు.

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

ఎమ్ పవర్ వ్యాగన్ఆర్

ఎమ్ పవర్ మరియు మారుతి సుజుకి మధ్య ఎలాంటి సంభందం లేదు. అయితే, ఈ రెండింటి కాంబినేషన్‌లో వ్యాగన్ఆర్ వస్తే ఎలా ఉంటుందో అని వ్యాగన్ఆర్ ఔత్సాహికుడు తన వ్యాగన్ఆర్‌ను ఎమ్-పవర్‍‌ బ్యాడ్జితో మోడిఫై చేశాడు.

ఎమ్-పవర్ బ్యాడ్జి నిజానికి బిఎమ్‌డబ్ల్యూ కార్లలో మాత్రమే ఉంటుంది. ఈ ఎమ్-పవర్ బ్యాడ్జ్‌కతో పాటు నూతన ఫ్రంట్ గ్రిల్ మరియు ఆకర్షణీయమైన హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

వ్యాగన్ఆర్ స్టింగ్‌రే

ఇది వరకు వ్యాగన్ఆర్ మోడిఫికేషన్స్ చూశాము. కానీ వ్యాగన్ఆర్ ఆధారంతో మారుతి సుజుకి పరిచయం చేసిన స్టింగ్‍‌రే మోడిఫికేషన్ ఇది. తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో నేలకు తాకే విధంగా ఉన్న ఫ్రంట్ గ్రిల్, మరియు బానెట్ మీదున్న రెడ్, బ్లాక్ మరియు బ్లూ స్ట్రిప్స్ ఉన్నాయి.

కేవలం మోడిఫికేషన్స్‌తో స్పోర్టీయర్ స్టింగ్‌రే కారుగా పేరు తెచ్చుకుంది. బానెట్ క్రింది వైపు సుజుకి లోగోకు ఇరువైపులా గుండ్రటి ఆకారంలో ఉన్న ఐబాల్ హెడ్ ల్యాంప్స్ ఇందులో ఉన్నాయి.

మోడిఫైడ్ మారుతి వ్యాగన్ఆర్ కార్లు

ఈ స్టోరీలో ఉన్న ఆరు మోడిఫైడ్ వ్యాగన్ఆర్ కార్లలో మీకు నచ్చిన కారు ఏది? ఆ మోడిఫికేషన్‌ను క్రింది కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో రీడర్స్‌తో పంచుకోండి...

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2017, 17:19 [IST]
English summary
Read In Telugu: 5 impressively modified Maruti WagonRs from India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+