2017 ఆడి ఏ3 విడుదల వివరాలు వెల్లడి

Written By:

ఆడి ఇండియా లైనప్‌లో సరికొత్త 2017 ఏ3 సెడాన్ కారు విడుదలకు సిద్దమైంది. ఆడి ఇండియా విభాగంలో ఉన్న ప్రారంభ శ్రేణి సెడాన్ కారు ఏ3 లో స్వల్ప అప్‌డేట్స్ నిర్వహించింది.

2017 ఆడి ఏ3

మునుపటి ఏ3 తో పోల్చుకుంటే దీని పొడవు 4.24 మీటర్లు మరియు వీల్ బేస్ 2.60 మీటర్లుగా ఉంది. ఫేస్‌లిఫ్ట్ ఆడి ఏ3 సెడాన్ కారులో సింగల్ ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్, పదునైన ఆకృతిలో ఉన్న హెడ్ ల్యాంప్స్ కలవు.

2017 ఆడి ఏ3

సాంకేతికంగా ఆడి ఏ3 లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ రానుంది. ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 ఆడి ఏ3

డీజల్ యూనిట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌కు డీజల్ ఇంజన్‌ వేరియంట్లు అత్యంతముఖ్యమైనవి, కాబట్టి 2017 ఏ3లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ అందివ్వడం జరుగుతోంది. ఇది 139బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 ఆడి ఏ3

డీజల్ ఇంజన్ వేరియంట్లో 6-స్పీడ్ గేర్‌బాక్స్ మరియు పెట్రోల్ వేరియంట్లో 7-స్పీడ్ ఎస్-ట్రోనిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

2017 ఆడి ఏ3

ఇంటీరియర్ మొత్తం మునుపటి ఏ3 మోడల్‌నే పోలి ఉంటుంది. డ్యాష్ డిజైన్‌లో కూడా ఎలాంటి మార్పులు లేవు. అయితే ఇందులో పైకి ఉబికివచ్చినటువంటి స్క్రీన్ చూడవచ్చు. మరియు రెండు గొట్టాల్లాంటి ఏసి వెంట్‌లను కూడా గమనించవచ్చు.

2017 ఆడి ఏ3

ఆడి ఇండియా ఇందులో ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను పరిచయం చేయడం లేదు, అయితే న్యావిగేషన్ మరియు రివర్స్ కెమెరాలను అందిస్తోంది.

2017 ఆడి ఏ3

2017 ఆడి ఏ3 సెడాన్ కారు ప్రస్తుతం విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ కారుకు గట్టి పోటీనివ్వనుంది.

Read more on: #ఆడి #audi
English summary
Also Read In Telugu: 2017 Audi A3 India Launch Date Revealed
Please Wait while comments are loading...

Latest Photos