2017 ఆడి ఏ3 విడుదల: ఇంజన్, ధర, మైలేజ్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

Written By:

2017 ఆడి ఏ3 (Audi A3) ఫేస్‍‌లిఫ్ట్ సెడాన్ నేడు(06 ఏప్రిల్, 2017) విపణిలోకి విడుదలయ్యింది.మార్పులు చేర్పులతో ఫేస్‌లిఫ్ట్ సెడాన్‌గా అందుబాటులోకి 2017 ఆడి ఏ3 సెడాన్ ప్రారంభ ధర రూ. 30.5 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నట్లు ఆడి ప్రతినిధులు పేర్కొన్నారు.

2017 ఆడి ఏ3 ఫేస్‍‌లిఫ్ట్ ధర వివరాలు

2017 ఆడి ఏ3 ఫేస్‍‌లిఫ్ట్ ధర వివరాలు

  • ఏ3 35 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ధర రూ. 30.5 లక్షలు
  • ఏ3 35 టిడిఐ డీజల్ ధర రూ. 32.3 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా
2017 ఆడి ఏ3 విడుదల

2016 నవంబర్‌లో మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసిన సిఎల్ఎ క్లాస్ తో ఈ 2017 ఆడి ఏ3 ఫేస్‌లిప్ట్ పోటీపడనుంది.

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

ఇంజన్ మరియు మైలేజ్ వివరాలు

రివైజ్ చేయబడిన ఆడి ఏ3లో 1.4-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 148బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీని మైలేజ్ 19.20కిమీ/లీ గా ఉంది.

2017 ఆడి ఏ3 విడుదల

ఆడి ఏ3 ఫేస్‌లిఫ్ట్‌లోని 2.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ గరిష్టంగా 139బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల దీని మైలేజ్ 20.38కిమీలుగా ఉంది.

డిజైన్

డిజైన్

డిజైన్ పరంగా మునుపటి ఏ3 తో పోల్చితే తేడాని పసిగట్టే విధంగా ఫ్రంట్ డిజైన్‌ను స్వల్ప మార్పులకు గురిచేయడం జరిగింది. మునుపచి ఫ్రంట్ గ్రిల్‌ స్థానంలో సింగల్ ఫ్రేమ్ డైమండ్ ఫ్రంట్ గ్రిల్‌ను అందివ్వడం జరిగింది.

2017 ఆడి ఏ3 విడుదల

సరికొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్‌కు అనుగుణంగా పగటి పూట వెలిగై ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న బై-జెనాన్ హెడ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది. హెడ్ లైట్లకు ఇరువైపులా అదనంగా ఎల్ఇడి లైట్లు అమర్చబడ్డాయి.

2017 ఆడి ఏ3 విడుదల

2017 ఆడి ఏ3 ఫేస్‌లిఫ్ట్ రియర్ డిజైన్ విషయానికి వస్తే, నూతన డిజైన్‌లో ఉన్న టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్‌లో ఎల్ఇడి లైట్లను మేళవించారు. మరియు స్పాయిలర్ తరహాలో బూట్ లిడ్‌(డిక్కీ డోర్)ను రూపొందించారు.

2017 ఆడి ఏ3 విడుదల

2017 ఆడి ఏ3 ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ ను డ్యూయల్ టోన్ లేదా బ్లాక్ కలర్ లెథర్ అప్‌హోల్‌స్ట్రేతో ఎంపిక చేసుకోవచ్చు. మూడు స్పోక్ స్టీరింగ్ వీల్, 7-అంగుళాల ఎమ్ఎమ్ఐ కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు, దీనికి 10 స్పీకర్ల ఆడియో సిస్టమ్ అనుసంధానం కలదు.

2017 ఆడి ఏ3 విడుదల

ఆడి ఇందులో అందించిన అదనపు ఫీచర్ల గురించి చూస్తే, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ పోడ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, సన్ రూఫ్, రియర్ వ్యూవ్ కెమెరా కోసం ముందు మరియు వెనుక వైపున ప్రాక్సిమిటి సెన్సార్లు అదే విధంగా ఏడు ఎయిర్ బ్యాగులను అందించారు.

English summary
Also Read In Telugu: 2017 Audi A3 Launched In India; Prices Start At Rs 30.5 Lakh. Audi A3 Launch Details In Telugu. Read more to know about Audi A3 Price, Engine, Mileage, Features, Specifications and more in Telugu
Story first published: Thursday, April 6, 2017, 15:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark