ఏ5 సిరీస్ కార్లను లాంచ్ చేసిన ఆడి ఇండియా

Written By:

ఆడి ఇండియన్ మార్కెట్లోకి తమ ఏ5 సిరీస్ కార్లను విడుదల చేసింది. సరికొత్త ఆడి ఏ5 ప్రారంభ ధర రూ. 54.02 లక్షలు(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. ఏ5 సిరీస్‍‌లో ఏ5 స్పోర్ట్‌బ్యాక్, ఏ5 క్యాబ్రియోలెట్ మరియు ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కార్లను లాంచ్ చేసింది.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఆడి ఏ5 స్పోర్ట్‌బ్యాక్ మరియు ఏ5 క్యాబ్రియోలెట్ కార్లు చూడటానికి ఒకేలా ఉంటాయి. ఒకే తరహా ఫ్రంట్ బానెట్, ఆడి సిగ్నేచర్ గ్రిల్, పగటి పూట వెలిగే లైట్ల జోడింపుతో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ విషయానికి వస్తే, దీనిని కూడా ఏ5 ఆధారంగానే నిర్మించారు. మిగతా రెండు మోడళ్లతో పోల్చితే విభిన్నంగా ఉండేందుకు పొడవాటి బానెట్, వేవ్ షోల్డర్ డిజైన్ క్యారెక్టర్ లైన్స్ వంటివి జోడించడం జరిగింది.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఎక్ట్సీరియర్ డిజైన్‌లో అల్యూమినియం ఆప్టిక్ డబుల్ హారిజంటల్ బ్లేడ్లున్నప్లాటినమ్ గ్రే సింగల్ ఫ్రేమ్ గ్రిల్, శాటిన్ ఫినిష్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ కప్స్, పూర్తి స్థాయి ఎల్ఇడి లైట్లు, మరియు ఆకర్షణీయమైన త్రీడి ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు టర్న్ సిగ్నల్స్ ఇందులో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఏ5 సిరీస్ కార్ల ఇంటీరియర్‌లో సరికొత్త స్పోర్టి త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, క్యాబిన్ మొత్తం బ్లాక్ వుడ్ ట్రిమ్(ఎస్5 లో ఫాక్స్ అల్యూమినియం ట్రిమ్), ఎమ్ఎమ్ఐ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు వర్చువల్ కాక్‌పిట్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

అదనంగా స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ద్వారా ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు 755వోల్ట్స్ బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్‌లను కనెక్ట్ చేయవచ్చు. మరియు స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్ కార్లలో సన్‌రూఫ్ కలదు.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఆడి ఏ5 వేరియంట్ల ధరలు

వేరియంట్లు ధరలు
ఏ5 స్పోర్ట్‌బ్యాక్ రూ. 54.04 లక్షలు
ఏ5 క్యాబ్రియోలెట్ రూ. 67.51 లక్షలు
ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ రూ. 70.60 లక్షలు
ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఆడి ఏ5 స్పోర్ట్‌బ్యాక్ మరియు ఏ5 క్యాబ్రియోలెట్ కార్లలో 2.0-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బో-డీజల్ ఇంజన్ కలదు. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ ఉత్పత్తి చేసే 197బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

అదే విధంగా ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ లగ్జరీ సెడాన్‌లో 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 349బిహెచ్‌పి పవర్ మరియు 500ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ నుండి ఆడి వారి సెల్ఫ్ లాకింగ్ సెంటర్ డిఫరెన్షియల్ గల క్వాట్రో పర్మినెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు అందుతుంది.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కేవలం 4.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఆదే విధంగా ఏ5 స్పోర్ట్‌బ్యాక్ మరియు ఏ5 క్యాబ్రియోలెట్ కార్లు 7.9 సెకండ్ల వ్యవధిలో 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటాయి.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

సరికొత్త ఆడి ఏ5 క్యాబ్రియోలెట్ విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సి 300 క్యాబ్రియోలెట్, ఏ5 స్పోర్ట్‌బ్యాక్ మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ మరియు వోల్వో ఎస్60 కార్లతో పోటీపడనున్నాయి.

ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారు మెర్సిడెస్ బెంజ్ సి43 ఏఎమ్‌జి మరియు వోల్వో ఎస్60 పోల్‌స్టార్ వంటి మోడళ్లతో పోటీపడనుంది.

ఆడి ఏ5 సిరీస్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా లైనప్‌లో ఉన్న ఏ4 మరియు ఏ6 మధ్య స్థానాన్ని ఏ5 భర్తీ చేయనుంది. స్పోర్టివ్ మరియు శక్తివంతమైన ఇంజన్‌తో మోటరింగ్ అనుభవాన్ని పొందాలనుకునే వారి క్యాబ్రియోలెట్ వెర్షన్ ఎంచుకోవచ్చు. మరియు ఏ5 సిరీస్‌లో పవర్‌ఫుల్ వెర్షన్ ఏదని ప్రశ్నించే వారికి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ గట్టి జవాబిస్తుంది.

ఆడి ఇండియా మొత్తానికి విపణిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మరియు వోల్వో కార్లకు ఆడి సరకొత్త పోటీని క్రియేట్ చేసింది.

English summary
Read In Telugu: Audi A5 Launched In India; Prices Start At Rs 54.02 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark