ఆడి ఏ6 లో సరికొత్త ఎడిషన్ విడుదల: ప్రారంభ ధర రూ. 56.78 లక్షలు

Written By:

ఆడి ఇండియా విపణిలోకి సరికొత్త ఏ6 డిజైన్ ఎడిషన్ లగ్జరీ సెడాన్ కారును విపణిలోకి విడుదల చేసింది. క్యూ7 డిజైన్‌ ఎడిషన్‌తో పాటు ఏ6 డిజైన్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు మోడళ్లు కూడా అధునాత ఫీచర్లతో లిమిటెడ్ ఎడిషన్‌గా కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్‌లో ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్, ముందు మరియు వెనుక వైపు డోర్లకు లోపలి వైపున ఆడి లోగో మరియు ప్రొజక్షన్ లైట్లు ఉన్నాయి, అదే విధంగా ఇందులో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Recommended Video - Watch Now!
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

సాంకేతికంగా ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ సెడాన్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు, 7-స్పీడ్ ఎస్ ట్రోనిక్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇంజన్ గరిష్టంగా 190బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ స్టాండర్డ్ మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ లైట్లను కలిగి ఉంది.

లిమిటెడ్ ఎడిషన్‌గా లభిస్తున్న ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్‌లోని స్టాండర్డ్ ఫీచర్లు

ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

ఎక్ట్సీరియర్ ఫీచర్లు

 • మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ లైట్లు మరియు డైనమిక్ టర్న్ ఇండికేటర్లు
 • లైట్/రెయిన్ సెన్సార్
 • బాడీ కలర్‌లో ఉన్న ఎక్ట్సీరియర్ మిర్రర్ హౌసెస్
 • హై-గ్లాస్ ప్యాకేజ్
 • ఎల్ఇడి రియర్ లైట్లు
 • ఎస్ లైన్ ప్యాకేజ్
 • రియర్ వ్యూవ్ కెమెరా
 • గ్లాస్ సన్ రూఫ్
ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

ఇంటీరియర్ ఫీచర్లు

 • ఎస్ లైన్ లోగో గల డోర్ సిల్ ట్రిమ్స్
 • ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ లైటింగ్ ప్యాకేజ్
 • మిలానో లెథర్ అప్‌హోల్‌స్ట్రే
 • అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ద్వారా ఆడి డ్రైవ్ సెలెక్ట్
 • ఫ్రంట్ సీట్ అడ్జస్ట్‌మెంట్
 • రియర్ విండో కోసం ఎలక్ట్రిక్ సన్ బ్లైండ్
 • పార్కింగ్ ఫీచర్లు
 • కంఫర్ట్ కీ
 • న్యావిగేషన్ డిస్ల్పే గల డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్
ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

 • బ్లూటూత్ ఇంటర్‌ఫేస్
 • ఎమ్ఎమ్ఐ న్యావిగేషన్ ప్లస్
 • బాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
 • ఎమ్ఎమ్ఐ టచ్
 • రియర్ ప్యాసింజర్ కోసం ఎమ్ఎమ్ రిమోట్ కంట్రోల్
ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రీమియమ్ సెడాన్‌ల స్థానంలో ఎక్జ్సిక్యూటివ్ లగ్జరీ సెడాన్ కార్లను అప్‌గ్రేడ్ చేసుకునే కస్టమర్లకు ఆడి ఏ6 అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. లగ్జరీ సెడాన్ కార్లను ఎంచుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ, ఆడి ఇండియాలో తమ పదేళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏ6 డిజైన్ ఎడిషన్ కారును పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తెచ్చింది.

English summary
Read In Telugu: Audi A6 Design Edition Launched In India; Priced At Rs 56.78 Lakh
Story first published: Thursday, August 17, 2017, 16:50 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark