జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

Written By:

దేశ వ్యాప్తంగా జూలై 1, 2017 న జిఎస్‌టి అమలుకానుంది. జిఎస్‌టి అమలుకావడానికి ముందే ఆడి తమ ఏ3, ఏ4, ఏ6 మరియు క్యూ3 కార్ల మీద ప్రి-జిఎస్‌టి ఆఫర్లను ప్రకటించింది. జిఎస్‌టి అమలు అయితే తగ్గనున్న కార్ల ధరలను ఆడి ముందుగానే తగ్గించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

పూర్తి స్థాయిలో జిఎస్‌టికి ఆమోదం లభించిన తరువాత జూలై 1, 2017 నుండి అమల్లోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. అయితే ఆటోమొబైల్ పరిశ్రమ మీద నిర్ణయించిన జిఎస్‌టిలో ఎప్పటికప్పుడుమార్పులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో కార్ల ధరల్లో మార్పులు ఏ మేరకు ఉంటాయన్న విశయంలో ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

ఇప్పటికే డీలర్ల వద్ద ఉన్న స్టాక్ క్లియర్ చేసుకోవడానికి కార్ల ధరలు తగ్గుముఖం పట్టనున్న తయారీ సంస్థలు తమ కార్ల మీద ప్రి జిఎస్‌టి పేరుతో భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. డీలర్లు నష్టపోకుండా, జిఎస్‌టి అమలయ్యే నాటికి మొత్తం స్టాక్ క్లియర్ చేయడమే లక్ష్యంగా ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

ఇదే బాటలో నడుస్తున్న ఆడి ఇండియా విభాగం, ఏ3 ప్రీమియ్ ప్లస్ టిడిఐ డీజల్ వెర్షన్ ధర రూ. 32.30 లక్షలు ఉండగా, దీనిని రూ. 29.99 లక్షల ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో అందుబాటులో ఉంచింది.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

అదే విధంగా ఏ4, ఏ6 మరియు క్యూ3 ల కొనుగోలు దారులు రూ. 6 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రత్యేకించి ఆడి ఏ6 డీజల్ సెడాన్ మీద కొన్ని నగరాల్లో రూ. 7 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

ఆడి ఇండియా విభాగానికి మంచి విక్రయాలు సాధించిపెడుతున్న క్యూ3 ఎస్‌యూవీ మీద రూ. 4 లక్షల వరకు, పరిమాణం పరంగా పెద్ద ఎస్‌యూవీలుగా పేరుగాంచిన క్యూ5 మరియు క్యూ7 ఎస్‌యూవీల మీద గణనీయమైన డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం వస్తు సేవల పన్ను అమల్లోకి రానున్న తరుణంలో, ఇండియాలో లగ్జరీ కార్లను తయారీ చేస్తున్న సంస్థలు బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల మీద ముందస్తు జిఎస్‌టి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

జిఎస్‌టి దెబ్బకు భారీగా దిగివచ్చిన ఆడి కార్ల ధరలు

అన్ని ఆటోమొబైల్స్ మీద నిర్దిష్టంగా 28 శాతం పన్నును నిర్ణయించింది. అయితే గతంలో లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ 55శాతముగా ఉండేది. 55 నుండి 28 శాతానికి ట్యాక్స్ దిగిరావడంతో లగ్జరీ కార్ల కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి.

Read more on: #ఆడి #audi
English summary
Read In Telugu Audi Offers Pre-GST Discounts
Story first published: Tuesday, June 13, 2017, 16:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark