2017 ఆడి క్యూ3 విడుదల: ఇంజన్, స్పెసిఫికేషన్లు మరియు ధరల కోసం...

Written By:

ఆడి ఇండియా విభాగం విపణిలోకి తమ చిన్న ఎస్‌యూవీ అయిన క్యూ3 యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. జర్మనీకి చెందిన ఈ కార్ల తయారీ సంస్థ ప్రధానమైన అంశాల వారీగా నూతన జోడింపుకు 2017 క్యూ3లో అవకాశం కల్పించింది. అంతే కాకుండా ఈ వెర్షన్‌లో ఎక్కువ శక్తివంతమైన వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

ఇంజన్ పరంగా ఇండియా ఈ 2017 క్యూడ్ మోడల్‌లో 2.0-లీటర్ సామర్థ్యం గల టిడిఐ ఇంజన్ అందివ్వడం జరిగింది. ఇందులోని క్వాట్రో మోడల్ గరిష్టంగా 182బిహెచ్‌పి పవర్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్ 147బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

రెండు వేరియంట్లు ఉత్పత్తి చేసే పవర్ మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. అయితే రెండింటికి 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

ఎక్ట్సీరియర్ మీద జరిగిన అప్‌డేట్స్ గమనిస్తే, కండలు తిరిగిన శైలిని ప్రతిబింబించే సరికొత్త ఫ్రంట్ బంపర్, బంపర్ మీద పదునైన డిజైన్ గీతలు కలవు, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ప్యానొరమిక్ సన్ రూఫ్ అందివ్వడం జరిగింది.

ఇంటీరియర్ విషయానికి వస్తే, కారు పై భాగంలో లోపలి వైపున(అప్ హోల్‌స్ట్రే) మొత్తాన్ని లెథర్ ఫినిషింగ్ చేయబడింది. క్వాట్రో మోడల్‌లో స్పోర్టివ్ అల్యూమినియం సొబగులు మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోడల్‌లో వాల్‌నట్ బ్రౌన్ సొబగులు పొదగించబడ్డాయి.

రెండు వేరియంట్లలో కూడా స్టాండర్డ్ ఫీచర్లుగా డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ద్వారా ముందు సీట్లను అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం కల్పించారు.

ఆడి ఇండియా విభాగాధిపతి రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, ఆడి దేశీయంగా క్యూ3 ఎస్‌యూవీని విడుదల చేసినప్పటి నుండి బెస్ట్ సెల్లింగ్ వేరియంట్ కాకుండా, సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోంది. పోటీ పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమైన అప్‌డేట్స్ నిర్వహించి విపణిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సరికొత్త 2017 ఆడి క్యూ3 లో అందించిన నూతన ఇంజన్ ఆప్షన్లు, ఆకర్షణీయమైన ఫీచర్లు, మరియు అతి ముఖ్యమైన ఫీచర్లను స్టాండర్డ్ వేరియంట్‌గా అందివ్వడంతో క్యూ3 అమ్మకాలు మునుపటి కన్నా ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

ధరలు...

  • ఆడి క్యూ3 2.0-లీ టిడిఐ ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 34.20 లక్షలు
  • ఆడి క్యూ3 2.0-లీ టిడిఐ క్వాట్రో వేరియంట్ ధర రూ. 37.20 లక్షలు
రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ఆడి ఇండియా తమ అప్‌డేటెడ్ 2017 క్యూ3 విడుదలతో ప్రస్తుతం విపణిలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 వేరియంట్ల నోటికి తాళం పడింది.

English summary
2017 Audi Q3 Launched In India; Priced At Rs 34.20 Lakh
Please Wait while comments are loading...

Latest Photos