క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి: ధర మరియు స్పెసిఫికేషన్లు

Written By:

జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా విభాగం విపణిలోకి ఈ ఏడాది ప్రారంభంలో క్యూ3 ఎస్‌యూవీని విడుదల చేసింది. ఇప్పుడు లైనప్‌ను విస్తరించే భాగంలోక్యూ3 ఎస్‌యూవీని పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి...

 

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

ఆడి తమ క్యూ3 పెట్రోల్ వేరియంట్ ఎస్‌‌యూవీని రూ. 32.20 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరతో విడుదల చేసింది. జర్మనీ కార్ల తయారీ సంస్థ అందిస్తున్న ఈ క్యూ3 ఎస్‌యూవీ పూర్తి స్థాయి పెట్రోల్ వేరియంట్.

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

ఆడి క్యూ3 లో 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు, గరిష్టంగా 150బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల ఇందులో 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కలదు.

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

ఆడి వద్ద ఉన్న పేరుగాంచిన క్వాట్రో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఇందులో రాలేదు, క్యూ3 లోని శక్తివంతమైన ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ముందు చక్రాలకు అందుతుంది.

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

క్యూ3 ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే, దీనికి తోబుట్టువుగా వ్యవహరించే డీజల్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ క్యూ3 ఎస్‌యూవీ మైలేజ్ లీటర్‌కు 16.9 కిలోమీటర్లుగా ఉంది.

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

ఆడి నేడు(మార్చి 31, 2017) ప్రవేశపెట్టిన క్యూ3 ఎస్‌యూవీలో ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రూయిజ్ కంట్రోల్, ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు ఆడి యొక్క డీలక్స్ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

క్యూ3 1.4 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ వేరియంట్ విడుదల చేసిన ఆడి

ఈ ఆడి క్యూ3 పెట్రోల్ ఎస్‌యూవీ ప్రస్తుతం ఇదే సెగ్మెంట్లో ఉన్న మెర్సిడెస్ జిఎల్ఎ 200 మోడల్‌కు బలమైన పోటీనివ్వనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఆడి విక్రయ కేంద్రాలలో ఈ క్యూ3 పెట్రోల్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

English summary
Audi Q3 1.4 TFSI Petrol Launched In India — Priced At Rs 32.20 Lakh
Story first published: Friday, March 31, 2017, 21:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark