ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్ విడుదల: ధర రూ. 81.99 లక్షలు

Written By:

జర్మన్ లగ్జరీ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఆడి విపణిలోకి క్యూ7 లగ్జరీ ఎస్‌యూవీ వాహనాన్ని సరికొత్త డిజైన్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఇండియాతో ఉన్న పదేళ్ల అనుభందానికి గుర్తుగా, పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని క్యూ7 డిజైన్ ఎడిషన్‌ను రూ. 81.99 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి పరిచయం చేసింది.

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఎంచుకోగలరని ఆడి పేర్కొంది. దీంతో పాటు ఆడి ఏ6 డిజైన్ ఎడిషన్ లగ్జరీ సెడాన్‌ను కూడా పరిమిత సంఖ్యలో అందుహబాటులో ఉంచింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

రెగ్యులర్ వెర్షన్ క్యూ7 తో పోల్చుకుంటే క్యూ7 డిజైన్ ఎడిషన్ విభిన్నంగా ఉండేందుకు అనేక ఎక్ట్సీరియర్ కాస్మొటిక్ సొబగులతో అధునాతన ఇంటీరియర్ ఫీచర్లను ఆడి ఇందులో అందివ్వడం జరిగింది.

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

క్యూ7లో స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, స్మోక్ టెయిల్ ల్యాంప్స్, రన్నింగ్ బోర్డ్స్, గ్లాస్ బ్లాక్ ఎగ్జాస్ట్ ట్రిమ్స్, 20-అంగుళాల అల్యూమినియం చక్రాలు మరియు డోర్లకు లోపలి వైపుల ల్యాంప్స్ ఉన్నాయి.

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

సాంకేతికంగా ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్‌లో 3.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ 249బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి పెడల్ షిఫ్టర్స్ ద్వారా అనుసంధానం చేసిన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గుండా పవర్ మరియు టార్క్ ఆడి క్వాట్రో పర్మనెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ నుండి పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు సరఫరా అవుతుంది.

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్‌లో స్టాండర్డ్‌గా లభించే ఫీచర్లు

ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

ఎక్ట్సీరియర్ ఫీచర్లు

 • డైనమిక్ ఇండికేటర్లు గల ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్
 • బాడీ కలర్‌లో ఉన్న ఎక్ట్సీరియర్ మిర్రర్ హౌసింగ్
 • ప్యానరోమిక్ సన్ రూఫ్
 • హై గ్లాస్ ప్యాకేజ్
ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

ఇంటీరియర్ ఫీచర్లు

 • ఆంబియంట్ లైటింగ్ ప్యాకేజ్
 • క్రికెట్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే
 • ఆల్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ మోడ్స్ గల అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్
 • ఆడి డ్రైవ్ సెలక్ట్
 • 4-వే లాంబార్ సపోర్ట్
 • రియర్ సీట్ కోసం ఎలక్ట్రిక్ సన్ బ్లైండ్, వెనుక సీటుకు ప్రక్కవైపున మ్యాన్యువల్ సన్ బ్లైండ్స్
 • ఎలక్ట్రిక్ లగేజ్ కంపార్ట్‌మెంట్ లిడ్
ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

ఇన్పోటైన్‌మెంట్

 • ఎమ్ఎమ్ఐ టచ్ గల ఎమ్ఎమ్ఐ న్యావిగేషన్
 • 3డి సౌండ్ గల బాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్
 • ఆడి వర్చువల్ కాక్‌పిట్
 • బ్లూటూత్ ఇంటర్‌ఫేస్
 • వాయిస్ డైలాగ్ సిస్టమ్
ఆడి క్యూ7 డిజైన్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా లైనప్‌లో క్యూ7 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మోడల్. అయితే ఇప్పుడు డిజైన్ ఎడిషన్ పేరుతో అధునాతన ఫీచర్లను జోడించడంతో రెగ్యులర్ క్యూ7 ఎంచుకునే వారు, డిజైన్ ఎడిషన్ క్యూ7 మీద మనసు పారేసుకోవడం ఖచ్చితం. అలాంటి కస్టమర్లను టార్గెట్ చేస్తూ సెగ్మెంట్ లీడర్‌గా దీనిని ప్రవేశపెట్టింది.

English summary
Read In Telugu: Audi Q7 Design Edition Introduced In India; Priced At Rs 81.99 Lakh
Story first published: Thursday, August 17, 2017, 17:05 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark