ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు...

Written By:

ఆడి ఇండియా విభాగం విపణిలోకి క్యూ7 ఎస్‌యూవీని పెట్రోల్ వేరియంట్లో విడుదల చేసింది. ఆడి క్యూ7 40 టిఎఫ్ఎస్ఐ ప్రీమియమ్ ప్లస్ వేరియంట్ ధర రూ. 67.76 లక్షలు మరియు క్యూ7 పెట్రోల్ టెక్నాలజీ ప్యాక్ వేరియంట్ ధర రూ. 74.43 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఇండియా)గా ఉన్నాయి.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

ఇంజన్ మరియు సాంకేతిక వివరాలు

ఆడి క్యూ7 పెట్రోల్ వేరియంట్లో 2.0-లీటర్ల సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 5,000 నుండి 6,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం మధ్య 248.5బిహెచ్‌పి పవర్ మరియు 1,600-4,500ఆర్‌పిఎమ్ మధ్య 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

శక్తివంతమైన ఇంజన్‌కు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ఆడి క్వాట్రో పర్మనెంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ మరియు టార్క్ అందుతుంది.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

ఆడి క్యూ7 40 టఎఫ్ఎస్ఐ కేవలం 6.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 233కిలోమీటర్లుగా ఉంది. ఏఆర్ఏఐ పరీక్షల ప్రకారం, ఆడి క్యూ7 పెట్రోల్ మైలేజ్ లీటర్‌కు 11.68 కిలోమీటర్లుగా ఉంది.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

డిజైన్ మరియు ఫీచర్లు

ఆడి క్యూ7 ఎస్‌యూవీని తొలుత డీజల్ వేరియంట్లో విడుదల చేసింది. పెద్ద పరిమాణంలో ఉన్న క్యూ7 ఎస్‌యూవీ బాడీ మొత్తం మీద ఉన్న క్యారెక్టర్ లైన్స్ యథావిధిగా ఉన్నాయి. ఫ్రంట్ డిజైన్‌లో మ్యాట్రిక్స్ ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంది. క్యూ7 పెట్రోల్ ఎస్‌యూవీలో 5-స్పోక్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి మరియు ఇందులో ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

ఆడి క్యూ7 ఇంటీరియర్‌లో క్రికెట్ లెథర్ అప్‌హోల్‌స్ట్రే, ముందు వైపున్న రెండు సీట్లను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం, ఎండ వేడిమిని నివారించే మ్యాన్యువల్ సన్‌బ్లైండ్స్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఆడి క్యూ7 7-సీటింగ్ లేఔట్లో ఉంది.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

వీటితో పాటు, సెంటర్ కన్సోల్ మీద పెద్ద పరిమాణంలో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే కలదు, టాప్ స్పెక్ వేరియంట్లో ఆడి వర్చువల్ కాక్‌పిట్ సిస్టమ్, డివిడి ప్లేయర్, బోస్ 3డి సరౌండ్ సౌండ్ సిస్టమ్, 30 విభిన్న రకాల ఆంబియంట్ లైటింగ్ సిస్టమ్‌తో పాటు స్మార్ట్ ఫోన్ లకు వైర్ లెస్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

సేఫ్టీ పరంగా ఆడి తమ క్యూ7 పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీలో, ఎనిమిది ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ఆడి ప్రి-సెన్స్ ప్రిడెక్టివ్ సేఫ్టీ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్, రియర్ వ్యూవ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ మరియు ఎన్నో భద్రత ఫీచర్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 పెట్రోల్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆడి ఇండియా లైనప్‌లో ఉన్న అన్ని మోడళ్లలో పెట్రోల్ వేరియంట్లను పరిచయం చేసే ప్రయాణంలో భాగంగా క్యూ7 ఎస్‌యూవీని పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేసింది.

వోక్స్‌వ్యాగన్ డీజల్ ఉద్గార నియమ కుంభకోణం తర్వాత ఎక్కువ మంది పెట్రోల్ వేరియంట్లను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం కేవలం డీజల్ వేరియంట్లలో మాత్రమే లభించే అన్ని మోడళ్లను ఇప్పుడు పెట్రోల్‌ ఇంజన్‌తో కూడా పరిచయం చేస్తోంది.

English summary
Read In Telugu: Audi Q7 40 TFSI (Petrol) Launched In India; Prices Start At Rs 67.76 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark