భారత్‌తో పదేళ్ల అనుభందాన్ని గుర్తుకుచేసుకుంటూ అన్‌బీటబుల్ ఆఫర్స్ ప్రకటించిన ఆడి

Written By:

ఆడి ఇండియా విభాగం దేశీయంగా ఉన్న తమ బెస్ట్ సెల్లింగ్ కార్ల మీద పరిమితకాలపు ఆఫర్స్‌ను ప్రకటించింది. భారీ డిస్కౌంట్స్ మరియు కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా ఆఫర్లను ఎంచుకునే అవకాశాన్ని అన్‌బీటబుల్ ఆఫర్స్‌ను ఆడి ప్రకటించింది.

ఆడి అన్‌బీటబుల్ల్ ఆఫర్స్

ఆడి తమ బెస్ట్ సెల్లింగ్ కార్లు అయిన, ఏ3, ఏ4 మరియు క్యూ3 ల మీద అతి తక్కువ వాయిదా చెల్లింపు రూ. 24,999 లను అందుబాటులోకి తెచ్చింది. అదే విధంగా మొదటి సంవత్సరం ఉచిత ఇన్సూరెన్స్‌తో పాటు అదనంగా మరో మూడేళ్లపాటు కొనసాగించబడిన వారంటీ కలదు.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
ఆడి అన్‌బీటబుల్ల్ ఆఫర్స్

ఆడి అన్‌బీటబుల్ ఆఫర్స్‌లో భాగంగా తక్కువ వడ్డీ రేటుతో కారు లోన్ ద్వారా ఆడి కార్లను ఎంచుకునే అవకాశంతో పాటు, ఎక్స్‌చ్ఛేంజ్‌ ఆఫర్ క్రింద లక్ష రుపాయల వరకు బోనస్ అందిస్తోంది.

ఆడి అన్‌బీటబుల్ల్ ఆఫర్స్

ఆఫర్ల గురించి ఆడి ఇండియా విభాగధిపతి రాహిల్ అన్సారీ మాట్లాడుతూ, " ఆడి ప్రకటించిన అన్‌బీటల్ ఆఫర్ సందర్భంలో మీకు నచ్చిన ఆడి కారును ఎంచోకోవడం ఎంతో ఉత్తమం అని తెలిపాడు. ఈ ఏడాది ద్వారా ఆడి ఇండియాతో పదేళ్ల అనుభందాన్ని పూర్తి చేసుకుంది. పదేళ్ల ప్రయాణంలో ఆడి ఇండియాలో ఎన్నో మైలు రాళ్లను ఛేదించింది. ఈ సందర్భానికి గుర్తుగా ఆడి అన్‌బీటబుల్ ఆఫర్స్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పుకొచ్చాడు."

ఆడి అన్‌బీటబుల్ల్ ఆఫర్స్

"జిఎస్‌టి అమల్లోకి రావడం ద్వారా లగ్జరీ కార్ల మీద ట్యాక్స్ స్వల్ప మేర తగ్గింది, దీనికి తోడు ఆడి అన్‌బీటబుల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన మరియు ఆడి బెస్ట్ సెల్లింగ్ కార్లను అత్యుత్తమ ఆఫర్లతో ఎంచుకోవడానికి ఇదేసరైన సమయం అని ఆయన చెప్పుకొచ్చాడు."

ఆడి అన్‌బీటబుల్ల్ ఆఫర్స్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జర్మన్ లగ్జరీ కార్ల సంస్థ ఆడి కు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా ఏ3, ఏ4 మరియు క్యూ3 కార్లు బెస్ట్ సెల్లింగ్ మోడళ్లుగా ఉన్నాయి. అత్యుత్తమ ఆఫర్లను ప్రకటించడంతో ఈ మూడింటి ద్వారా విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఈ మూడు మోడళ్లను ఈ మధ్యనే అప్‌గ్రేడ్ చేసి అందుబాటులో ఉంచింది.

Read more on: #ఆడి #audi
English summary
Read In Telugu: Audi ‘Unbeatable’ Offers: Here’s A List Of Offers From Audi India
Story first published: Monday, August 7, 2017, 15:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark