పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరులో 25 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: కేంద్ర ప్రభుత్వం

Written By:

ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కోసం బెంగళూరు నగరంలో 25 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది.

హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు వినియోగాన్ని పెంచడానికి కృషిచేస్తున్న ఫేమ్(FAME) బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్టుగా ఎలక్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

బెంగళూరులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు

"ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా (FAME-India) స్కీమ్ క్రింద, మహీంద్రా రెవా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బెంగళూరులోని ఆరు ప్రదేశాల్లో 25 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు", కేంద్ర విద్యుత్, బొగ్గు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి పియూష్ గోయల్ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
బెంగళూరులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఏకైక సంస్థ మహీంద్రా రెవా ఎలక్ట్రిక్ వెహికల్స్. కేంద్ర ప్రభుత్వ చొరవతో మహీంద్రా గ్రీన్ సిటిలోని ఆరు ప్రధాన ప్రాంతాలలో ఈ 25 ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది.

బెంగళూరులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు

"భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడానికి, అదే విధంగా రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇస్ట్రుమెంట్స్ లిమిటెడ్ కేంద్ర రాజధాని పరిధిలో, జైపూర్ మరియు ఛంఢీగర్‌లలో 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి." అయితే ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు పియూష్ గోయల్ తెలిపాడు.

బెంగళూరులో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కేంద్ర ప్రభుత్వం ఇదే చొరవతో, ఫేమ్ సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే, 2030 నాటికి పెట్రోల్ మరియు డీజల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలి అనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

English summary
Read In Telugu: Bengaluru Receives Electric Charging Stations Under Government's Pilot Program
Story first published: Saturday, July 29, 2017, 15:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark