హైదరాబాద్ మరియు బెంగళూరులో అత్యుత్తమ క్యాబ్ సర్వీసులు

Written By:

సిటి ట్రావెల్ కోసం ఒకప్పుడు ఎక్కువగా సిటి బస్సులను మరియు ఆటో రిక్షాలను ఎక్కువగా వినియోగించేం వాళ్ల. అయితే ఈ మధ్య కాలంలో ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యాక అద్దె కార్లలో దర్జాగా ట్రావెల్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు అద్దె కార్ల వ్యాపారం కొన్ని కోట్లకు పడగలెత్తింది. అన్నింటిలో మంచి అంశాలు ఉన్నట్లే చెడు అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన రకరకాల క్యాబ్ సర్వీసుల్లో అత్యుత్తమ క్యాబ్ సర్వీసుల జాబితా మీ కోసం....

ఉబర్

ఉబర్

ప్రస్తుతం ఉన్న బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాబ్ సర్వీసుల్లో ఉబర్ ఒకటి. బడ్జెట్ ఫ్రెండ్లీ మాత్రమే కాదండోయ్ ఉబర్‌ను ట్రావెల్ ఫ్రెండ్లీ సర్వీసుగా కూడా ఎంచుకోవచ్చు. ఉబర్ సేవల్లో ఉబర్ఎక్స్, ఉబర్‌బ్లాక్ నుండి ఉబర్ ఎస్‌యూవీ వరకు పలు రకాల సర్వీసులను ఎంచుకోవచ్చు. ఉబర్ క్యాబ్ సర్వీసుల కోసం టయోటా ఎటియోస్, మహీంద్రా వెరిటో మరియు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్‌లతో పలురకాల కార్లు ఉబర్ ట్యాక్సీలుగా సేవల్లో ఉన్నాయి.

ఓలా క్యాబ్స్

ఓలా క్యాబ్స్

ఈ రెండు నగరాల్లో క్యాబ్ సర్వీసులను పూర్తి స్థాయిలో తొలిసారిగా ప్రారంభించిన సంస్థ ఓలా. ఓలా సర్వీసును 24 గంటల్లో ఎప్పుడైనా వినియోగించే సదుపాయం కలదు. ఎయిర్ పోర్ట్ పికప్ మరియు డ్రాప్, షార్ట్ ట్రిప్ లేదా హాలిడే ట్రిప్ కోసం కూడా ఓలా క్యాబ్‌ను లక్షణంగా ఉపయోగించుకోవచ్చు. బిల్లు చెల్లించేటపుడు ఎలాంటి వేధింపులు ఎదుర్కోకుండా ఓలా మీటర్ సహాయంతో చెల్లింపులు జరపవచ్చు.

మేరు క్యాబ్స్

మేరు క్యాబ్స్

ఉబర్ మరియు ఓలా కాకుండా ఎంచుకోదగ్గ మరో బెస్ట్ క్యాబ్ సర్వీస్ మేరు క్యాబ్స్. సౌకర్యం మరియు నాణ్యత ఆధారంగా మేరు వద్ద ఉన్న విసృతమైన కార్లను ఎంచుకోవచ్చు. రేడియా క్యాబ్ బుకింగ్ సర్వీసు ప్రారంభించిన ఏకైక సంస్థ మేరు. సరసమైన అద్దెకు లేదంటే సురక్షితమైన ట్రావెల్‌కు అనుగుణంగా మేరు ట్యాక్సీలను అందుబాటులో ఉంచింది. హైదరాబాద్‌, బెంగళూరుతో పాటు కలకత్తా, ముంబాయ్, చంఢీఘర్, ఢిల్లీ, వడోదర, జైపూర్, అహ్మదాబాద్ మరియు చెన్నైతో పాటు ఇతర ప్రధాన నగరాలలో మేరు సర్వీసులందిస్తోంది. బాగా శిక్షణ పొందిన మరియు ప్రొఫెషనల్ డ్రైవర్లు మేరు వద్ద ఉన్నారు.

ఆరేంజ్ క్యాబ్స్

ఆరేంజ్ క్యాబ్స్

పైన తెలిపిన మూడు సంస్థలను బాగానే విని ఉంటారు, అయితే ఆరేంజ్ క్యాబ్స్ విషయానికి వస్తే అత్యుత్తమ క్యాబ్ బుకింగ్ సంస్థగా పేరెన్నికగన్నది. ధరల నిర్ణయించడంలో ఆరేంజ్ క్యాబ్స్ మంచి సక్సెస్ సాధించింది. విశ్వసనీయ మరియు నాణ్యమైన సేవలకు ఆరేంజ్ క్యాబ్స్ బెస్ట్.

సిగ్మా క్యాబ్స్

సిగ్మా క్యాబ్స్

హైదరాబాద్ యొక్క సురక్షితమైన క్యాబ్ సంస్థగా సిగ్మా క్యాబ్స్ మంచి మార్కులు పొందింది. సిగ్మా క్యాబ్స్ వెబ్‌సైట్లో క్యాబ్ బుక్ చేసుకోవడం నిమిషం కన్నా ఎక్కువ సమయం తీసుకోదు.

యుటూ

యుటూ

ప్రీమియమ్ ట్యాక్సీ సర్వీస్‌గా యూటూ సంస్థ తొలుత చెన్నైలో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలలో విస్తరణ ఏర్పాట్లు చేస్తోంది. కాంపాక్ట్ మరియు సెడాన్ సెగ్మెంట్లో డాట్సన్ గో ప్లస్ మరియు నిస్సాన్ సన్నీ కార్లను అందుబాటులో ఉంచగా, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన రైడింగ్‌లను సరసమైన రేట్లలో కల్పిస్తోంది. తెల్లవారుజాము నుండి అర్థరాత్రి వరకు యుటూ క్యాబ్ సేవలందిస్తోంది.

గెట్‌మిక్యాబ్

గెట్‌మిక్యాబ్

దగ్గర ప్రాంత పరిధికి కాకుండా దూర ప్రాంత ప్రయాణ అవసరాలకు గెట్‌మిక్యాబ్ ప్రసిద్ది. రెండు నగరాల మధ్య వన్ వే, టు వే లతో పాటు వివిధ నగారలకు మరియు ఎయిర్ పోర్ట్ నుండి పికప్ అదే విధంగా డ్రాపింగ్ సర్వీసులందిస్తోంది గెట్‌మిక్యాబ్. హైదరాబాద్ మరియు బెంగళూరుతో సహా దేశవ్యాప్తంగా మొత్తం 25 నగరాల్లో గెట్‌మిక్యాబ్ సేవలందిస్తోంది.

ఆహా ట్యాక్సీస్

ఆహా ట్యాక్సీస్

ఆన్‌లైన్లో ఆహా ట్యాక్సీస్ బారీ దృష్టిసారించింది. అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా 350 నగరాల్లో ఆహా ట్యాక్సీ సేవలను విస్తరించింది. అతి తక్కువ ధరలకు అవుట్‌స్టేషన్ సేవలందించడంలో ఆహా ట్యాక్సీ కీలకం. అతి తక్కువ అంటే నిర్ణీత దూరం తరువాత కిలోమీటర్‌కు రూ. 10 లు మాత్రమే మరియు తమ పోటీదారుల కంటే 40 శాతం తక్కువ ధరలకే సేవలందిస్తోంది. హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మరియు ఎస్‌యూవీలతో ఎకానమీ, కంఫర్ట్ మరియు ప్రీమియమ్ క్లాసెస్ అనే సర్వీసులందిస్తోంది.

మైల్స్

మైల్స్

ట్యాక్సీల అనంతరం అద్దె కార్ల వ్యాపారం సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వ్యాపారంలోకి మళ్లింది, ఇందులో కూడా మంచి కంపెనీలు మంచి ఆఫర్లనందిస్తున్నాయి. భారతదేశపు మొదటి సెల్ఫ్ డ్రైవ్ కార్ సర్వీసును ప్రారంభించినట్లు చెప్పుకుంటున్న మైల్స్ సంస్థ ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్, సెడాన్, మిని ఎస్‌యూవీ, ఎలక్ట్రిక్ మరియు అనేక ఇతర రేంజ్‌‌లలో కార్లను అందుబాటులో ఉంచింది. సుమారుగా 38 రకాల వాహనాలను గంటకు, రోజుకు, వారానికి మరియు నెలకు చొప్పున అద్దెకు తీసుకోవచ్చు.

జూమ్ కార్

జూమ్ కార్

అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచిన ప్యాకేజీలను ఎంజాయ్ చేయాలంటే జూమ్ కారు ఎంచుకోవచ్చు. జూమ్ లైట్, జూమ్ క్లాసిక్ మరియు జూమ్ ఎక్స్ఎల్ అనే విభిన్న ప్యాకేజీలను వివిధ రకాల అవుట్‌స్టేషన్ అవసరాలకు ఎంచుకోవచ్చు. వారంతపు జర్నీల కోసం తక్కవ స్థాయి కార్ల నుండి ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మరియు జిఎల్ఎ కార్లను కూడా ఎంచుకోవచ్చు.

క్లియర్ కార్ రెంటల్

క్లియర్ కార్ రెంటల్

అవసరమైన ప్రమాణాలకు మరియు సమయ ప్రణాళికలకు అనుగుణంగా సేవలందించడంలో తామే నెంబర్ వన్ అంటోంది క్లియర్ కార్ రెంటల్ అద్దె కార్ల సంస్థ. హైదరాబాద్ మరియు బెంగళూరుతో సహా దేశవ్యాప్తంగా 210కి పైగా నగరాల్లో క్లియర్ కార్ రెంటల్ సేవలున్నాయి. రౌండ్ ట్రిప్, వన్ వే ట్రిప్ మరియు మల్టి సిటి అనే మూడు రకాల సర్వీసులను అందుబాటులో ఉంచింది.

ఏవిస్

ఏవిస్

ఏవిస్ సంస్థ సుమారుగా 19 భారత ప్రధాన నగరాల్లో సేవలందిస్తోంది. మేము ధృడంగా ప్రయత్నిస్తున్నాము అనే ట్యాగ్ లైన్‌తో ప్రతి కస్టమర్ కూడా సులభంగా మరియు సౌకర్యవంతంగా మాతో అద్దె అనుభవాన్ని పొందగలరని గ్యారంటీ ఇస్తున్నారు. ఏవిస్ విసృతమైన వాహనాలను అందుబాటులో ఉంచింది. అందులో ప్రధానంగా లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలు, ఎమ్‌యూవీలు మరియు హ్యాచ్‌బ్యాక్ కార్లు ఉన్నాయి.

సవారి

సవారి

భౌగోళికంగా విస్తరించిన నగరాలను ఆధారంగా చేసుకుని భారత దేశపు అతి పెద్ద అద్దె కార్ల సంస్థ అని సవారి తెలిపింది. ప్రస్తుతం 60 కి పైగా నగరాల్లో సవారీ కార్లు అందుబాటులో ఉన్నాయి. సేవల్లో పారదర్శకత, సమయానికి సర్వీసులందించడంలో సవారీ బెస్ట్ అని చెప్పవచ్చు. వ్యాపార సంభందిత ట్రిప్పులు, వన్ వే మరియు టు వే సర్వీసులను సవారీ అందిస్తోంది. అన్ని రకాల కార్లు సవారీ సంస్థ వద్ద సేవల్లో ఉన్నాయి.

హైదరాబాదులో అత్యుత్తమ క్యాబ్ సర్వీసులు

ఈ కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో వ్రాయగలరు!

మీకు నచ్చిన కార్ల ఫోటోలను వీక్షించండి మరియు మీకు నచ్చిన నగరంలో మీకు నచ్చిన కార్ల ధరలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి...

 

English summary
Best Cab Services In Hyderabad And Bangalore

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark