బిఎమ్‌డబ్ల్యూ కారులో అనుకోకుండా చెలరేగిన మంటలు

Written By:

మీ ఫేవరెట్ కారు ఏదని ఎవరినైనా అడిగితే వారి సమాధానంలో జర్మన్‌కు చెందిన టాప్ 3 కార్ల తయరీ సంస్థలలో ఖచ్చితంగా ఒకటై ఉంటుంది. ఇందుకు లగ్జరీ, సౌకర్యం, సేఫ్టీ, బిల్ట్ క్వాలిటీ మరియు అత్యుత్తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ప్రధాన కారణాలని చెప్పుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

అన్నింటి కంటే అతి ముఖ్యమైన అంశం సేఫ్టీ, డబ్బు ఎంతైనా పర్వాలేదు సేఫ్టీ ముఖ్యం అనుకునే వారు జర్మనీకి చెందిన ఆడి, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎంచుకుంటారు. సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ముంబాయి నగరానికి చెందిన సంజయ్ త్రిపాఠి 2011లో బిఎమ్‌డబ్ల్యూ 320డి సెడాన్ కారును కొనుగోలు చేసాడు.

Recommended Video - Watch Now!
[Telugu] 2018 Bentley Continental GT Revealed - DriveSpark
బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

సేఫ్టీ కోసం ఎంచుకున్న ఆయన ఎంపిక(బిఎమ్‌డబ్ల్యూ 320డి) నవంబర్ 13 ఉదయం అనుకోని షాక్ ఇచ్చింది. పార్కింగ్ స్పేస్ నుండి కారును బయటకు తీసినపుడు కారు క్రింద భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

రోజూలాగే ఆఫీసుకు వెళ్లే క్రమంలో సంజయ్ త్రిపాఠీ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని పార్కింగ్ లాబీ నుండి కారును బయటకు తీశాడు. కారు క్రింద నిప్పు రవ్వలు రాజుకుని మంట కాస్త పెద్దదైంది. దీని గమనించిన సెక్యురిటీ గార్డ్ డ్రైవర్‌ను అప్రమత్తం చేసాడు.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

వెంటనే అక్కడే ఉన్న సెక్యురిటీ సిబ్బంది నీరు మరియు అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. మొత్తానికి సేఫ్టీ కోసం తీసుకున్న కారులో అనుకోకుండా మంటలు చెలరేగడంతో సంజయ్ ఖంగుతిన్నాడు.

మారుతి స్విఫ్ట్‌ కాదని గ్రాండ్ ఐ10 కారును అధికంగా ఎంచుకుంటున్నారు: ఎందుకో తెలుసా?

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

మంటలు అదులోకి వచ్చిన తరువాత సంజయ్ త్రిపాఠీ బిఎమ్‌డబ్ల్యూ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే, మీరు కారు కొనుగోలు చేసి ఐదేళ్లు దాటిపోయింది కనుక ఇప్పుడు మేము ఏమీ చేయలేమని బిఎమ్‌డబ్ల్యూ రోడ్ సైడ్ అసిస్టెన్స్ బృందం చేతులెత్తేసింది.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

మంటలు చెలరేగిన కారులో నేను, మా కూతురు ఉన్నాము. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటపడ్డాము. ఇదే కారు భారీ అగ్నిప్రమాదానికి గురైతే మీరు ఇలాగే స్పందిస్తారా అని బిఎమ్‌డబ్ల్యూ ఏజెంట్ మీద ఆరోపణలు చేశారు. అయితే, మీరు కారు కొనుగోలు చేసిన డీలర్‌ను సంప్రదించమని సమాధానం మినహాయిస్తే, ఎలాంటి సహాయం అందలేదు.

నిజానికి, ఘటన జరిగిన కేవలం నాలుగు గంటల తరువాత బిఎమ్‌డబ్ల్యూను సంప్రదిస్తే ఇలాంటి సమాధానం వచ్చింది. జర్మన్ దిగ్గజం బిఎమ్‌‌డబ్ల్యూ మీద ఉన్న కోపాన్ని మరియు అసహనాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అనతి కాలంలో సంజయ్ చేసిన ట్వీట్ వైరల్ కావడంతో మధ్యాహ్నానికి బిఎమ్‌డబ్ల్యూ ప్రతినిధులు కారును సర్వీస్ కోసం తీసుకెళ్లారు.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

ట్విట్టర్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఇండియాను ట్యాగ్ చేసి, హ్యాష్‌ట్యాగ్స్ జోడించి తన వేదనను ట్వీట్ ద్వారా పోస్ట్ చేయగానే బిఎమ్‌డబ్ల్యూ స్పందించింది. ఇలాంటి ధోరణి ఖచ్చితంగా మారాలి. భద్రత కోసం ఖరీదైన కార్లను ఎంచుకున్నపుడు రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం సంప్రదించినపుడు అలాంటి సమాధానం ఇస్తే లక్షల పోసి ఇలాంటి కార్లు కొనుగోలు చేయడం దండగే.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

ఈ ఘటన జరగడానికి సరిగ్గా పది రోజుల క్రితం నవంబరు 3న ఉత్తర అమెరికాలో సుమారుగా 14 కార్లను రీకాల్ చేసింది. 2006 నుండి 2011 మధ్య ఉత్పత్తి చేసిన కార్లను వెనక్కి పిలిచినట్లు తెలిసింది. వీటిలో 3-సిరీస్ సెడాన్ కార్లు కూడా ఉన్నట్లు సంజయ్ త్రిపాఠీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ కారులో మంటలు

సుమారుగా పదేళ్ల తరువాత బిఎమ్‌డబ్ల్యూ రీకాల్ చేసింది. కార్లలో అనుకోకుండా మంటలు చెలరేగుతున్న కారణంతో రీకాల్ అయినట్లు తెలిసింది. ఉన్నట్లుండి కార్లలో మంటలు చెలరేగడం అత్యంత ప్రమాదకరమైనది.

English summary
Read In Telugu: BMW Catches Fire In Mumbai; Owner Alleges Denying Of Services By Roadside Assistance

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark