జిఎస్‌టి ఎఫెక్ట్‌తో తగ్గిన బిఎమ్‌డబ్ల్యూ కార్ల ధరలు
నూతన పన్ను విధానం అమల్లోకి రావడంతో లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు, లగ్జరీ కార్లు మరింత చౌక లభించనున్నాయి. జిఎస్‌టిని అనుసరిస్తూ ఇప్పటికే పలు లగ్జరీ కార్ల తయరీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించాయి.
నూతన పన్ను విధానం అమల్లోకి రావడంతో లగ్జరీ కార్ల కొనుగోలుదారులకు, లగ్జరీ కార్లు మరింత చౌక లభించనున్నాయి. జిఎస్‌టిని అనుసరిస్తూ ఇప్పటికే పలు లగ్జరీ కార్ల తయరీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించాయి. ఇప్పుడు బిఎమ్‌డబ్ల్యూ కూడా తమ కార్ల మీద ధరలను తగ్గించింది.

మెర్సిడెస్ బెంజ్ దేశీయంగా ఉన్న తమ ఉత్పత్తుల ధరలను ఇప్పటికే తగ్గించింది. ఇప్పుడు ఇదే బాటలో బిఎమ్‌డబ్ల్యూ తమ ఉత్పత్తుల మీద ధరలు తగ్గించింది. జిఎస్‌టికి లోబడి చేసిన ధరల సవరణలో 3-సిరీస్ మీద రూ. 45,000 ల వరకు తగ్గింది.

గతంలో లగ్జరీ కార్ల మీద 43 శాతం వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉండేది. అయితే నూతన పన్ను విధానం(గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమల్లోకి రావడంతో 12 శాతం వరకు ట్యాక్స్ తగ్గింది. దీంతో లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కార్ల ఎక్స్-షోరూమ్ ధరలో తగ్గింపును ప్రకటిస్తున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా లైనప్‌లో, 1-సిరీస్ హ్యాచ్‌బ్యార్, 3-సిరీస్, 5-సిరీస్, మరియు 7-సిరీస్ లగ్జరీ సెడాన్లు, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5 ఎస్‌యూవీలతో పాటు 3-సిరీస్ జిటి వంటి కార్లు ఉన్నాయి.

అంతే కాకుండా ఇతర మోడళ్లయిన బిఎమ్‌డబ్ల్యూ ఐ8, 6-సిరీస్ గ్రాన్ కూపే, ఎక్స్6, ఎక్స్5 ఎమ్ మరియు ఎక్స్6 ఎమ్, ఎమ్3, ఎమ్5 మరియు జడ్4 వంటి వాటిని దిగుమతి చేసుకుని దేశీయంగా అందుబాటులో ఉంచింది.


Click it and Unblock the Notifications








