రూ. 38.6 లక్షల ప్రారంభ ధరతో బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం విపణిలోకి 320డి ఎడిషన్ స్పోర్ట్ లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది. దేశీయంగా సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ ధర రూ. 38,60,000 లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

320డి ఎడిషన్ స్పోర్ట్ మోడల్‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. అయిచే ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా అనేక కాస్మొటిక్ మెరుగులతో పాటు ఇతర 3-సిరీస్ కార్లతో పోల్చుకుంటే ప్రత్యేకంగా కనిపించే రూపాన్ని ఇందులో కల్పించడం జరిగింది.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ కారులో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్భోఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 187బిహెచ్‌పి పవర్ మరియు 1750 నుండి 2750ఆర్‌పిఎమ్ మధ్య గరష్టంగా 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ కేవలం 7.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిలోమీర్లుగా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ కథనం మేరకు 320డి ఎడిషన్ స్పోర్ట్ గరిష్ట మైలేజ్ లీటర్‌కు 22.69కిలోమీటర్లు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ కారులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో అనేక కాస్మొటిక్ సొబగలు అందించింది. ఇందులో ప్రధానంగా హై గ్లాస్ బ్లాక్ ను ఫ్రంట్ మరియు రియర్ డిజైన్ మీద గుర్తించవచ్చు. దీంతో కారు మొత్తం స్పోర్టివ్ లక్షణాలను కలిగి ఉంది. బిఎమ్‌డబ్ల్యూ వారి ఇకానిక్ ఫ్రంట్ కిడ్నీ గ్రిల్‌లో ఉన్న గ్లాస్ బ్లాక్ సొబగులు గమనించవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

320డి ఎడిషన్ స్పోర్ట్ కారు ఇంటీరియర్ మొత్తాన్ని స్పోర్టివ్ థీమ్‌లో రూపొందించింది. ఎరుపు మరియు నలుపు రంగుల మేళవింపుతో ఉన్న స్పోర్టివ్ సీట్లు, ఎర్రటి ధారంతో స్టిచ్చింగ్ చేసిన స్టీరింగ్ వీల్ తొడుగులు మరియు అత్యంత స్పోర్టివ్ ఫీల్ కలిగించే పెడల్ షిఫ్టర్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

కారులోని సెంటర్ కన్సోల్ మీద అదనపు క్రోమ్ సొబగులను అందివ్వడం జరిగింది. దీంతో పాటు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 205 వాట్ 9-స్పీక్ర్ హై-ఫై సౌండ్ సిస్టమ్ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

అంతేకుండా బిఎమ్‌డబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6.5-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ డిస్ల్పే, సిడి చేంజర్, బ్లూటూత్, యుఎస్‌బి మరియు ఏయుఎక్స్ కనెక్టివిటి కలదు. రియర్ వ్యూవ్ కెమెరా దృశ్యాలను డిస్ల్పేలో చూడవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్పోర్టివ్ లక్షణాలున్న లగ్జరీ కారును ఎంచుకోవాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని బిఎమ్‌డబ్ల్యూ 320డి ఎడిషన్ స్పోర్ట్ కారును విపణిలోకి విడుదల చేసింది. అత్యుత్తమ మైలేజ్, పవర్ మరియు ఫీచర్లను అందిస్తూ, ధరకు తగ్గ విలువలతో అందుబాటులోకి తెచ్చింది.

English summary
Read In Telugu: BMW 320d Edition Sport Launched In India For Rs 38.6 Lakh
Story first published: Friday, August 4, 2017, 12:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark