బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ విడుదల:ధర, ఇంజన్ మరియు ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్(BMW 330i Gran Turismo M Sport) కారును విడుదల చేసింది.

By Anil

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్(BMW 330i Gran Turismo M Sport) కారును విడుదల చేసింది. సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 49.40 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ కారులో ఎమ్ స్పోర్ట్ ప్యాకేజ్ ద్వారా 3-సిరీస్ గ్రాన్ టురిస్మొ మరింత స్పోర్టివ్‌నెస్ ఎక్ట్సీరియర్ సొంతం చేసుకుంది మరియు ఇది నాన్ మెటాలిక్ కలర్‌గా ఆల్పైన్ వైట్ మరియు మెటాలిక్ కలర్‌గా ఎస్టోరిల్ బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ ఫ్రంట్ మరియు రియర్ సైడ్ రీడిజైన్ చేయబడిన బంపర్, అధునాతన న్యూ బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, మరియు ఈ గ్రిల్ మీద //M బ్యాడ్జ్ కలదు. ఎమ్3 ప్రేరణ పొందిన 18-అంగుళాల ఎమ్-స్పోర్ట్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

Recommended Video

2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ ఇంటీరియర్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ల స్టాండర్డ్ స్పోర్ట్ సీట్లను కలిగి ఉంది. జిటి(గ్రాన్ టురిస్మొ) కారులో ఎమ్ చిహ్నం గల నూతన కీ, ఎమ్ స్టీరింగ్ వీల్ మరియు సరికొత్త హెడ్ లైనర్‌తో పాటు డోర్లకు లోపలి వైపు మరియు హెడ్స్ అప్ డిస్ల్పే మీగ ఎమ్ బ్యాడ్జ్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ తమ ఎమ్ స్పోర్ట్ లో విభిన్న ఎంచుకోదగ్గ అప్‌హోల్‌స్ట్రే ఆప్షన్లను ఇస్తోంది, అవి, లెథర్ డకోట వెనిటొ బీజి/ఓయ్‌స్టర్ డార్క్ హైలైట్ - వెనెటొ బీజి మరియు లెథర్ డకోట కోగ్నాక్/ బ్రౌన్ హైలైట్ - బ్లాక్.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ లగ్జరీ కారులో 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 250బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో స్టీరింగ్ వీల్ పెడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

టుర్బోఛార్జ్‌డ్ ఇంజన్ ద్వారా బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్-స్పోర్ట్ కేవలం 6.1 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు గ్రాన్ టురిస్మొ మైలేజ్ లీటర్‌కు 15.34కిలోమీటర్లుగా ఉంది.

వేగాన్ని నియంత్రించేందుకు బ్రేకింగ్ ఫంక్షన్స్ గల క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థ ఇందులో ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

భద్రత పరంగా బిఎమ్‌డబ్ల్యూ తమ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్‌లో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను అందించింది. అవి, ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్.

వీటితో పాటు, క్రాష్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, ఎమర్జెన్సీ స్పేర్ వీల్, ఫ్లాట్ టైర్లు వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు బిఎమ్‌డబ్ల్యూ తమ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ కారులో ఆటో స్టార్ట్-స్టాప్, ఎకో ప్రో మోడ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్, వివేకవంతమైన తేలికపాటి నిర్మాణం, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ కలదు. వీటితో పాటు డ్రైవర్ తన డ్రైవింగ్ స్టైల్ మరియు రోడ్డు పరిస్థితులను బట్టి కంఫర్ట్, ఎకో ప్రో, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్ డ్రైవింగ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్ ఇంటీరియర్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఐడ్రైవ్ కనెక్టివిటి ఉన్న 22.3సెమీల పరిమాణం గల డిస్ల్పే, బిఎమ్‌డబ్ల్యూ న్యావిగేషన్ సిస్టమ్ ప్రొఫెషనల్, టచ్ ఫంక్షనాలిటీ గల 3డీ మ్యాప్స్, బిఎమ్‌డబ్ల్యూ అప్లికేషన్లు, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ మరియు బ్లూటూత్, యుఎస్‌బి లేదా ఎయుఎక్స్ఇన్ కనెక్టివిటి సదుపాయం కలదు.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మొ ఒక్క డీజల్ వేరియంట్లో - బిఎమ్‌డబ్ల్యూ 320డి గ్రాన్ టురిస్మొ లగ్జరీ లైన్ మరియు రెండు పెట్రోల్ వేరియంట్లలో - బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ లగ్జరీ లైన్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్.

బిఎమ్‌డబ్ల్యూ 330ఐ గ్రాన్ టురిస్మొ ఎమ్ స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ తమ 3-సిరీస్ సెగ్మెంట్‌కు ఎమ్ స్పోర్ట్ ప్యాకేజి పేరుతో ఎన్నో సొబగులు అద్ది లగ్జరీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సేఫ్టీ, లగ్జరీ, సౌకర్యం మరియు భద్రత పరంగా బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ జిటి ఇప్పటికే మంచి పాపులారిటీ దక్కించుకుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 17, 2017, 19:16 [IST]
English summary
Read In Telugu: BMW 330i Gran Turismo M Sport Launched In India. BMW 330i gran turismo m sport launched in india launch, price, specifications, images
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+