సౌత్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం తమ 2017 5-సిరీస్ కారును జూన్ 29 న ముంబాయ్‌ వేదికగా దేశీయ విపణిలోకి విడుదల చేశాక, ఇప్పుడు సౌత్ ఇండియన్ మార్కెట్లోకి బెంగళూరు వేదికగా తమ 5-సిరీస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.49.90 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ రీజనల్ లాంచ్ బెంగళూరులోని లావెల్ రోడ్డులో ఉన్న నవనీత్ మోటార్స్ షోరూమ్‌లో జరిగింది. విడుదల సమయంలో బిఎమ్‌డబ్ల్యూ ఔత్సాహికులు 5-సిరీస్ విడుదల వేదికను చుట్టుముట్టేశారు.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 502ఐ వేరియంట్లో 4-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్, 520డి వేరియంట్లో 4-సిలిండర్ల డీజల్ ఇంజన్ మరియు 530డి లగ్జరీ లైన్ మరియు ఎమ్ స్పోర్ట్ వేరియంట్లలోని 6-సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్టంగా 265బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ధరలు వేరియంట్ల వారీగా

  • 520డి స్పోర్ట్ లైన్ ధర రూ. 49.90 లక్షలు
  • 530ఐ స్పోర్ట్ లైన్ ధరరూ. 49.90 లక్షలు
  • 520డి లగ్జరీ లైన్ ధరరూ. 53.60 లక్షలు
  • 520డి ఎమ్ స్పోర్ట్ ధరరూ. 61.30 లక్షలు
2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

మునుపటి 5-సిరీస్‌తో పోల్చుకుంటే ఈ 2017 బిఎమ్‌డబ్ల్యూ పెద్ద పరిమాణంలో తక్కువ బరువుతో ఉంది. తద్వారా ఇంటీరియర్ స్పేస్ గణనీయంగా పెరిగింది. అదే విధంగా మెరుగైన యాక్సిలరేషన్ కూడా ఇందులో. టాప్ ఎండ్ వేరింట్ ఎమ్-స్పోర్ట్ కేవలం 5.7 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

5-సిరీస్ లగ్జరీ సెడాన్ కారులోని టాప్ స్పెక్ ఫీచర్ల గురించి చూస్తే, టచ్ స్క్రీన్ కీ ద్వారా యాక్టివేట్ అయ్యే రిమోట్ పార్కింగ్ సిస్టమ్, అంతే కాకుండా గెస్ట్చర్ కంట్రల్ ఫీచర్ కూడా ఇందులో కలదు.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

సరికొత్త 2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల వేదిక మీద నవనీత్ మోటార్స్ ప్రతినిధులు దీనిని కొనుగోలు చేసిన కొంత మంది కస్టమర్ల పేర్లను వెల్లడించి, వారికి కార్లను డెలివరీ ఇచ్చారు. రూ. 5 లక్షల రుపాయలు చెల్లించి సరికొత్త 5-సిరీస్‌ను బుక్ చేసుకోవచ్చు.

English summary
Read In Telugu: 2017 BMW 5 Series Launched In Bangalore; Prices Start At Rs 49.90 Lakh
Story first published: Thursday, July 13, 2017, 10:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark