2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల: ధర, ఇంజన్ మరియు ఫీచర్లు...

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగం సరికొత్త 2017 5-సిరీస్ లగ్జరీ సెడాన్ కారును విపణిలోకి విడుదల చేసింది. మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ప్రారంభ ధర రూ. 49.90 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ స్పెసిఫికేషన్స్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ స్పెసిఫికేషన్స్

సరికొత్త 5-సిరీస్ బిఎమ్‌డబ్ల్యూ సెడాన్ కారులో మూడు విభిన్నమైన ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఒక్క పెట్రోల్ మరియు రెండు డీజల్ ఇంజన్ వేరియంట్లు. అన్ని ఇంజన్ వేరియంట్లకు అనుసంధానం చేసిన 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా అవుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ పెట్రోల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ పెట్రోల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

పెట్రోల్ వేరియంట్ 5-సిరీస్ సెడాన్ బ్యానెట్ క్రింద 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 248.5బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 530ఐ పెట్రోల్ వేరియంట్ సెడాన్ కేవలం 6.2-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్టం వేగం గంటకు 250కిమీలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ డీజల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ డీజల్ వేరియంట్ స్పెసిఫికేషన్స్

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ సెడాన్‌లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న టుర్బో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 520డి మోడల్ బ్యానెట్ క్రింద ఉంది. ఇది గరిష్టంగా 187బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ వేరియంట్ కేవలం 7.2సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 235కిమీలుగా ఉంది.

2017 బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ లోని 520డి ఎమ్ లో శక్తివంతమైన 3.0-లీటర్ డీజల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. ఇది 261బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇది కేవలం 5.7-సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 250కిమీలుగా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ధర వివరాలు

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ ధర వివరాలు

వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధరలు
520డి స్పోర్ట్ లైన్ రూ. 49.90 లక్షలు
530ఐ స్పోర్ట్ లైన్ రూ. 49.90 లక్షలు
520డి లగ్జరీ లైన్ రూ. 53.60 లక్షలు
530డి ఎమ్ స్పోర్ట్ రూ. 61.30 లక్షలు
డిజైన్

డిజైన్

మునుపటి 5-సిరీస్ స్థానాన్ని భర్తీ చేస్తూ వచ్చిన మోడల్‌ ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు సంభవించాయి. బిఎమ్‌డబ్ల్యూ వారి ప్రసిద్దిగాంచిన కిడ్నీ గ్రిల్‌కు ఇరువైపులా పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి.

కొలతలు

కొలతలు

సరికొత్త 5-సిరీస్ పొడవు-4,935ఎమ్ఎమ్, వెడల్పు-1,868ఎమ్ఎమ్, ఎత్తు-1,466ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్-2,975ఎమ్ఎమ్‌గా ఉంది. మునుపటి 5-సిరీస్ కన్నా ఇది 6ఎమ్ఎమ్ పొడవైనది, 2ఎమ్ఎమ్ ఎత్తైనది మరియు వీల్ బేస్ కూడా 7ఎమ్ఎమ్ వరకు పెరిగింది. పది లీటర్ల వరకు అదనంగా బూట్ స్పేస్ పెరగడంతో ఇప్పుడు 530-లీటర్ల బూట్ స్పేస్ కలదు. మునుపటి 5-సిరీస్ కన్నా ఇది 70-కిలోల వరకు తేలికైనది.

ఫీచర్లు

ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ప్రేరిత స్పోర్ట్స్ డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ డిజైన్ స్కీమ్‌లను 5-సిరీస్‌లో పరిచయం చేయడం జరిగింది. మరియు 5-సిరీస్ లోని అప్‌హోల్‌స్ట్రేని ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. ప్రిసెట్ గెస్చర్, ఐడ్రైవ్ కంట్రోలర్ లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా ఆప్‌రేట్ చేయగల 10.25-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఇంటీరియర్ లోని ఇతర ఫీచర్లు

ఇంటీరియర్ లోని ఇతర ఫీచర్లు

600వాట్ సామర్థ్యం ఉన్న 16-స్పీకర్ల హార్మాన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్, హెడ్స్ అప్ డిస్ల్పే, 360-కెమెరాలు, ఆంబియంట్ లైటింగ్, వైర్ లెస్ ఛార్జింగ్, మరియు వెనుక వరుస ప్యాసింజర్ల కోసం సీట్ల మీద 10.2-అంగుళాల డిస్ల్పేలు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ సేఫ్టీ ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ సేఫ్టీ ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ తమ 5-సిరీస్ సెడాన్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, డైనమిక్ బ్రేకింగ్ లైట్స్, పార్కింగ్ డిస్టెన్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటి కంట్రోల్ మరియు కార్నరింగ్ బ్రేకింగ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ లభించు రంగులు

బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ లభించు రంగులు

సరికొత్త 5-సిరీస్ సెడాన్ ఎనిమిది విభిన్న రంగుల్లో లభించును. అవి, ఆల్పైన్ వైట్, బ్లాక్ సఫైర్, బ్లూస్టోన్ మెటాలిక్, కార్బన్ బ్లాక్, క్యాష్మెరా సిల్వర్, ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్, జటోబా మరియు మెడిటెర్రేనియన్ బ్లూ.

English summary
Read In Telugu 2017 BMW 5 Series Launched In India; Prices Start At Rs 49.90 Lakh

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark