TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో మెరిసిన బిఎమ్‌డబ్ల్యూ ఐవిజన్ డైనమిక్స్
ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్దిగాంచిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో కన్నుల పండుగలా సాగుతోంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగర వేదికగా జరుగుతున్న వాహన ప్రదర్శనలో ప్రపంచ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు తమ ఫ్యూచర్ కార్లను ఆవిష్కరించాయి.
ఈ 2017 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో లో బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ కారుకు చూపరుల తాకిడి విపరీతంగా ఉంది. విన్నూతన డిజైన్ శైలిలో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ సందర్శకులను ఆకట్టుకుంటోంది.
బిఎమ్‌డబ్ల్యూ ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ కారుగా వచ్చే దశాబ్దంలో ప్రపంచ విపణిలోకి రానుంది. ప్రస్తుతం కాన్సెప్ట్ దశలో ఉన్న ఇది ఐ5 పేరుతో లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో విడుదల కానుంది.
ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ కారు కేవలం 4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, మరియు గరిష్టంగా గంటకు 193కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని బిఎమ్‌డబ్ల్యూ వెల్లడించింది.
పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ లగ్జరీ కారు ఐవిజన్ డైనమిక్స్ ఒక్క సారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 600కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉన్నట్లు దీని ప్రదర్శన వేదిక మీద బిఎమ్‌డబ్ల్యూ తెలిపింది.
డిజైన్ విషయానికి వస్తే, 2016 లో బిఎమ్‌డబ్ల్యూ ఆవిష్కరించిన విజన్ నెక్ట్స్ 100 కాన్సెప్ట్ ఆధారంగా ఐవిజన్ డైనమిక్స్ కారును డిజైన్ చేశారు. ఫ్రంట్ డిజైన్‌లో ఉన్న పొడవాటి కిడ్నీ గ్రిల్, పొడవాటి బానెట్, ఫ్రంట్ హెడ్ లైట్లు మరియు టెయిల్ లైట్లను విజన్ నెక్ట్స్ 100 కాన్సెప్ట్ ప్రేరణతో తీర్చిదిద్దారు.
బిఎమ్‌డబ్ల్యూ ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ పెద్ద పరిమాణంలో ఉన్న గాజు గదిని పోలి ఉంటుంది. కారు ముందు నుండి టాప్ మరియు వెనుక వైపున్న అద్దం వరకు మొత్తం ఒకే అద్దంతో నిర్మించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2025 లోపు 25 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసే లక్ష్యంలో భాగంగా భవిష్యత్ ఎలక్ట్రిక్ ఐ5 కారును ఐవిజన్ డైనమిక్స్ కాన్సెప్ట్ రూపంలో ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షో వేదిక మీద ఆవిష్కరించింది.
డీజల్ మరియు పెట్రోల్ కార్లను స్వస్తి పలికి ఎలక్ట్రిక్ కార్ల మీద దృష్టిసారిస్తున్న మెర్సిడెస్ మరియు వోక్స్‌వ్యాగన్ వారి ఫ్యూచర్ లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లకు దీనిని పోటీగా బిఎమ్‌డబ్ల్యూ దీనిని అభివృద్ది చేస్తోంది.