బిఎస్3 రద్దు ప్రభావం: అమ్ముడుపోని వాహనాల విలువ రూ. 5000 కోట్లు

Written By:

సుప్రీం కోర్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిఎస్3 వాహనాల బ్యాన్ ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావం చూపింది. గడువులోపు బిఎస్3 వాహనాలను విక్రయించేందుకు భారీ స్థాయిలో ఆఫర్లను ప్రకటించినప్పటికీ 5000 కోట్ల రుపాయల వరకు నష్టం వాటిల్లింది.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

దేశీయ వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరగడం ఆటోమొబైల్ పరిశ్రమలో పెట్టుబడుల మీద తీవ్ర ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. బిఎస్3 వాహనాల మీద విధించిన రద్దు సుమారుగా 20,000 కోట్ల రుపాయల విలువైన 8 లక్షల వాహనాల మీద ప్రభావం పడినట్లు దేశీయ వాహన తయరీదారుల సంఘం సియామ్ పేర్కొంది.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

సియామ్ డైరక్టర్ జనరల్ విష్ణు మథుర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బిఎస్3 వాహనాల సంఖ్య 1.2 లక్షల యూనిట్లు మరియు వీటి విలువ సుమారు రూ. 5,000 కోట్ల పైమాటే అని తెలిపాడు.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

బిఎస్3 వాహనాల స్టాకును క్లియర్ చేసుకునేందుకు కేవలం ద్విచక్ర వాహన తయారీదారులు మాత్రమే భారీ సంఖ్యలో ఆఫర్లు ప్రకటించాయి. దాదాపు గరిష్ట విక్రయాలు చేపట్టినప్పటికీ భారీ డిస్కౌంట్ల ద్వారా రూ. 12,000 కోట్లు నష్టం వాటిల్లింది.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

ఏప్రిల్1, 2017 తరువాతస కూడా బిఎస్3 వాహనాలను విక్రయించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించినా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బిఎస్3 వాహనాల విక్రయాలను పూర్తిగా రద్దు చేసిన విషయాన్ని సియామ్ గుర్తుకుచేసింది.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

వ్యాపార వాతావరణంలో అనిశ్చితి పెరిగిపోవడం భారతీయ వాహన పరిశ్రమ పెట్టుబడుల మీద ప్రభావం ఎక్కువవుతోందని మథుర్ పేర్కొన్నారు. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు పరిశ్రమ దీర్ఘకాలిక కొనసాగింపు మీద కూడా ప్రభావం ఏర్పడుతుందని ఆయన తెలిపాడు.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

అయితే ప్రస్తుతం మిగిలిపోయిన బిఎస్3 వాహనాలను ఏం చేయాలనేది ఆ యా తయారీ సంస్థలదే తుది నిర్ణయం. అయితే కొన్ని సంస్థలు మాత్రమే ఇతర విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయడం తప్పితే మరో అవకాశం లేవంటున్నాయి.

బిఎస్3 వాహన విక్రయాల రద్దు

మార్చి 31, 2017 నాటి తారీకు బిల్లుతో కొనుగోలు చేసిన అన్ని వాహనాలను కూడా అప్పటి నుండి తదుపరి మూడు నెలలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

 
English summary
Read In Telugu BS-III Ban Effect — Vehicles Worth Rs 5,000 Crore Still Unsold Despite Hefty Discounts
Story first published: Thursday, April 13, 2017, 13:02 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark