మీ కార్ల మీద నిషేధిత క్రాష్ గార్డ్స్ ఉంటే జరిమానా ఎంతో తెలుసా?

భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, కార్లు, ఎస్‌యూవీ, మరియు ఇతర వాహనాల మీద క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్లను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధించింది.

By Anil

భారత ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం, కార్లు, ఎస్‌యూవీ, మరియు ఇతర వాహనాల మీద క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్లను ఏర్పాటు చేసుకోవడాన్ని నిషేధించింది. అంతే కాకుండా వాహనదారులు మరియు పాదచారుల భద్రత పరంగా భారీ మోడిఫికేషన్స్‌ బ్యాన్ చేసింది.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

తాజాగా అందిన సమాచారం మేరకు, అనధికారికంగా క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్స్ ఏర్పాటు చేసుకున్న వారి మీద కఠిన చర్యలు తీసుకొని, అలాంటి వాహనాలను సీజ్ చేసి, వారికి జరిమానా విధించాలని కేంద్ర దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Recommended Video

Driverless Auto Rickshaw On Indian Highway
నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

వెహికల్స్ మీద అనధికారికంగా క్రాష్ గార్డ్స్ ఏర్పాటు చేసుకోవడాన్ని 1988, మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లఘించిన నేరం క్రింద తొలి జరిమానా క్రింద డ్రైవర్‌కు రూ. 1,000 లు మరియు రెండవసారి పట్టుబడితే రూ. 2,000 లు మరియు క్రాష్ గార్డ్స్ విక్రయించే వారికి రూ. 5,000 ల వరకు జరిమానా విధించనున్నారు.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 52 ప్రకారం కార్లు మరియు ఎస్‌యూవీల ముందు వైపున క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్స్ ఫిట్ చేయడం చట్టపరంగా విరుద్దం. ఇలా చేస్తే మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190 మరియు 191 క్రింద జరిమానా అర్హులని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల రవాణా కమీషనర్లకు లేకలో పేర్కొన్నారు.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

అన్ని రాష్ట్రాల రవాణా శాఖ కమీషనర్లు మరియు అధికారులు దీనిని సీరియస్‌గా తీసుకొని, క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్లను అనధికారికంగా ఫిట్ చేయించుకున్న వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర వెలువరించిన ప్రకటనలో పేర్కొంది.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

మోటార్ వాహనాల చట్టం 1988 సెక్షన్ 190 ప్రకారం, రోడ్డు భద్రత పట్ల కనీస ప్రమాణాలను పాటించకుండా పబ్లిక్ రోడ్ల మీద శబ్ద మరియు గాలి కాలుష్యానికి కారకుడైతే రూ. 1,000 లు మొదటి జరిమానా, రెండవసారి కూడా ఇదే కారణంతో పట్టుబడితే రూ. 2,000 లు జరిమానా పడటం ఖాయం.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

అంతే కాకుండా విక్రయదారులు క్రాష్ గార్డ్స్ మరియు బుల్ బార్లను దిగుమతి చేసుకోవడం సెక్షన్ 191 ప్రకారం చట్టపరమైన ఉల్లంఘన. పబ్లిక్ రోడ్ల మీద ఇబ్బందికరంగా, ప్రజారవాణకు సమస్యాత్మకంగా, వాహనాలను మోడిఫై చేయడం, వాహనతయారీదారుడి డిజైన్‌లో మార్పులు చేయడం, వెహికల్ పార్ట్స్‌ను ఆల్టర్ చేయడం మరియు ఇతర మోడిఫైడ్ విడిభాగాలను తయారు చేడయడం, విక్రయించడం వంటివి మోటార్ వాహనాల చట్టంలోని 7 వ అద్యాయం ప్రకారం నేరం. ఇలాంటి వారికి గరిష్టంగా రూ. 5,000 ల వరకు జరిమానా విధిస్తారు.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కార్లు, జీపులు, ఎస్‌యూవీలు మరియు ఇతర వాహనాల మీద ముందు వైపున క్రాష్ గార్డ్స్ తరహాలో ఉన్న బంపర్లను అమర్చుకోవడం చూడటానికి మంచి లుక్ ఇస్తాయి. అయితే, ఆ వాహనాల్లో ఉన్న ప్రయాణికులు మరియు రోడ్డు మీద ఉన్న పాదచారుల భద్రత దృష్ట్యా వాటిని ఏర్పాటు చేసుకోవడం చాలా ప్రమాదకరం.

నిషేధిత క్రాష్ గార్డ్స్ జరిమానా

కార్ల తయారీ సంస్థలు భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని అంశాల పరంగా ఆలోచించి డిజైన్ చేస్తాయి. కానీ, మనకు ఇష్టమొచ్చినట్లు మోడిఫై చేసుకుంటే అలాంటి మార్పులు పెద్ద పెద్ద ప్రమాదాలకు కారణం కావచ్చు. కాబట్టి మీ వాహనాలలో ఎలాంటి మార్పులు చేయించకండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Saturday, December 23, 2017, 16:54 [IST]
English summary
Read In Telugu: Indian Government Bans Car & SUV Crash Guard — Here's The Fine (Penalty) Amount
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+