వచ్చే నెలలో డాట్సన్ నుండి శక్తివంతమైన రెడి-గో వెర్షన్
నిస్సాన్ భాగస్వామ్యంలో ఉన్న డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి తమ రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారును 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లో విడుదల చేయడానికి సిద్దమైంది.
డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి తమ రెడి-గో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను శక్తివంతమైన 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లో విడుదల చేయనుంది. రెడి-గో 800సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ ఆప్షన్‌లో విడుదలై, అత్యంత సరసమైన ప్రారంభ కారుగా విపణిలో మంచి ఆదరణ పొందింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు 1.0-లీటర్ మోడల్ సిద్దం చేశారు.

జూలై 19, 2017 రోజున దీని విడుదల ఉందని తెలిసింది. కానీ డాట్సన్ ఈ వేరియంట్ విడుదల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 1.0 లీటర్ వెర్షన్ విడుదల చేసిన కొంత కాలానికి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ (AMT) ను కూడా అందివ్వనుంది.

డాట్సన్ తమ రెడి-గో 800సీసీ వేరియంట్‌ను గత ఏడాది జూన్‌లో మార్కెట్లోకి విడుదల చేసింది. 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

డాట్సన్ రెడి-గో కారులో పరిచయం చేయాలనుకుంటున్న ఇంజన్‌ను రెనో క్విడ్ నుండి సేకరించనుంది. క్విడ్ లోని 1.0-లీటర్ ఇంజన్ డాట్సన్ తమ రెడి-గో లో ఇప్పటికే ట్రై చేసి మరియు టెస్ట్ చేయబడింది.

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌ను వచ్చే అక్టోబర్ నాటికి విడుదల చేయనుంది. డాట్సన్ రెడి-గో ను విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు 30,000 యూనిట్లను విక్రయించింది. 1.0 లీటర్ వేరియంట్ ధర ప్రస్తుతం ఉన్న మోడల్ ధర కన్నా రూ. 30,000 ల నుండి 55,000 వరకు అధికంగా ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
డాట్సన్ రెడి-గో కారులో 1.0-లీటర్ ఇంజన్ పరిచయం చేయడం ద్వారా సేల్స్ పెరిగే అవకాశం ఉంది. శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లో స్మాల్ కారును ఎంచుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. అయితే డాట్సన్ తమ ఉత్పత్తులతో ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Click it and Unblock the Notifications








