మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ను తీసుకెళ్లిన ఘనుడు

ఓ బిజినెల్ మ్యాన్ ఉదయం ఆడి కారులో బయటకు వెళ్లాడు. అయితే, ఆడి కారును వదిలేసి ఆ రాత్రికి అంబులెన్స్ డ్రైన్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి ఇంటికి చేరుకున్న వ్యక్తి తన కారును ఎక్కడో వదిలేసి అంబులెన్

By Anil

ఓ బిజినెల్ మ్యాన్ ఉదయం ఆడి కారులో బయటకు వెళ్లాడు. అయితే, ఆడి కారును వదిలేసి ఆ రాత్రికి అంబులెన్స్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అర్థరాత్రి ఇంటికి చేరుకున్న వ్యక్తి తన కారును ఎక్కడో వదిలేసి అంబులెన్స్ నడుపుకుంటూ వచ్చినట్లు తెలుసుకొని నాలుక కరుచుకున్నాడు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

మద్యం మత్తులో మందు బాబులు చేసే చేష్టలు చాలా అవతారంగా ఉంటాయి. అయితే, కొంత మందిని ఇరకాటంలోకి కూడా నెట్టేస్తాయి. అందుకు ఉదాహరణ ఇవాళ్టి "మద్యం మత్తులో అంబులెన్స్ తీసుకెళ్లిన మందు బాబు" కథనం....

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

సుమారుగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పేషంట్‌ను హాస్పిటల్‌కు తరలించడానికి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారాన్నందించిన హాస్పిటల్ సిబ్బంది, వైద్యానికి అన్నీ సిద్దం చేసుకున్నారు.

Recommended Video

Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

అయితే, ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. హాస్పిటల్ ఆవరణంలో ఉండాల్సిన అంబులెన్స్ వెహికల్ కనిపించకపోవడం. మారుతి ఓమిని హాస్పిటల్ అంబులెన్స్/ఎమర్జెన్సీ వెహికల్ దొంగతనానికి గురయ్యిందని యాజమాన్యం భావించింది.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, హాస్పిటల్ అంబులెన్స్‌ చోరీకి గురైనట్లు వివరించి, కంప్లైంట్ ఇచ్చారు. అర్థరాత్రి గస్తీ నిర్వహిస్తున్న పోలీసు బృందానికి స్టేషన్ సిబ్బంది సమాచారమందివ్వడంతో వారు వెంటనే హాస్పిటల్ చేరుకున్నారు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

కొద్ది సమయానికి చోరీకి గురైందని భావించిన అంబులెన్స్ హాస్పిటల్‌కు మళ్లీ వచ్చింది. అంబులెన్స్‌లో వచ్చిన ఆ వ్యక్తి అక్కడే ఉన్న పోలీసులకు వాహనాన్ని అప్పగించి, మా బాస్ పొరబాటున తన ఆడి కారుకు బదులుగా అంబులెన్స్ ఇంటికి తీసుకొచ్చాడని వివరణ ఇచ్చి, క్షమాపణలు కోరాడు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

ఇది విన్న పోలీసుల ఖంగుతిన్నారు. ఏం జరిగిందో క్షుణ్ణంగా వివరించమని అడగడంతో. "మా బాస్ ఓ వ్యాపారవేత్త, హాస్పిటల్‌కు ఆడి కారులో వచ్చిన ఆయన వెళ్లేటపుడు మద్యం మత్తులో మారుతి ఓమిని కారును ఆడి కారు అనుకుని ఇంటికి తీసుకొచ్చాడని" చెప్పుకొచ్చాడు.

Trending On Drvespark Telugu:

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

నిజానికి ఆయన తన ఆడి కారును హాస్పిటల్ బయట పార్క్ చేశాడు. ఓమిని అంబులెన్స్ హాస్పిటల్ ఆవరణంలో ఉండటంతో అదే తన కారు అనుకొని పొరబాటున ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపాడు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

పోలీసులు వెంటనే ఆ ఆడి కార్ ఓనర్ గురించి అతగాడి మీద ప్రశ్నల వర్షం కురిపించారు. మద్యం మత్తులో ఆయన హాస్పిటల్‌కు ఎందుకొచ్చాడు? దీనికి బదులిస్తూ, ఇదే హాస్పిటల్‌లో మా ఓనర్ ఫ్రెండ్ అడ్మిట్ అయ్యాడు. ఆయన్ని పరామర్శించడానికి వచ్చినట్లు తెలిపాడు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

అంతటితో ఆగని పోలీసులు, అర్థరాత్రి సమయంలో, అది కూడా మద్యం సేవించి ఎందుకొచ్చాడని కూపీలాగడంతో అస్సలు ఆ హాస్పిటల్ తన స్నేహితులెవరూలేరని తేలింది. ఎందుకొచ్చాడని గద్దించడంతో అసలు విషయం తెలిసింది.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

మద్యం సేవించి కారు నడిపితే పోలీసులకు దొరుకుతాననే భయంతో హాస్పిటల్ బయట తన కారును పార్క్ చేసి, హాస్పిటల్ ఆవరణంలో ఉన్న అంబులెన్స్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. అంబులెన్స్‌ను పోలీసులు ఆపరు అనే ఉద్దేశ్యంతో ఆపని చేశాడు.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

ఎలాగో ఇంటికివెళ్లాక తన పనివాడి చేత అంబులెన్స్‌ను హాస్పిటల్‌లో వదిలేసి, అక్కడే పార్క్ చేసిన కారును తీసుకురమ్మని చెప్పచ్చులే అనుకున్నాడు. తన యజమాని చెప్పినట్లు హాస్పిటల్‌కు అంబులెన్స్‌తో వచ్చాడు. అయితే అక్కడే ప్లాన్ బెడిసికొట్టింది.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

అంబులెన్స్ హాస్పిటల్‌కు రావడం, అక్కడే పోలీసులు ఉండటం, వారి పద్దతిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి తప్పించుకోవడానికి చేసిన ప్లాన్, తనంతట తానే కేసులో ఇరుక్కునేలా చేసింది.

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ తీసుకెళ్లాడు

అంతా అనుకున్నట్లుగానే జరిగుంటే, ఆయన లక్కే లక్కు. కానీ ఈ సారి అదృష్టం ఆయన ప్రక్కన లేకపోవడంతో పోలీసులు ఆయన చేసిన పనికి ఎఫ్ఐర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోరుతో పోయేదాన్ని గొడ్డలితో నరకడం అంటే ఇదేనేమో మరి. ఇంత ప్లాన్ చేసిన, అతను తన అనుచరుడినే రమ్మని కారులో తీసుకెళ్లమని చెప్పలేకపోయాడు చూడండి...

ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్సులో మాతో పంచుకోండి!!

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2017, 16:44 [IST]
English summary
Read In Telugu: Drunk man drives home Maruti Omni ambulance instead of his Audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+