టయోటా ఇన్నోవాకు పోటీగా వస్తున్న వెహికల్ రహస్యంగా పట్టుబడింది
ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎలాగైనా రాణించేందుకు ప్రయత్నిస్తున్న మహీంద్రా ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా వాహనానికి పోటీని సృష్టిస్తోంది. తాజాగా దీనిని పరీక్షిస్తూ డ్రైవ్‌స్పార్క్ మీడియా కంటబడింది.
ఎస్‌యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా గత కొంత కాలంగా రెండు మూడు ఎస్‌యూవీలను రహస్యంగా వివిధ ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తూ వస్తోంది. అందులో ఇన్నోవా క్రిస్టాకు పోటీగా ఒక వెహికల్‌ను సిద్దం చేస్తోంది.

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఎలాగైనా రాణించేందుకు ప్రయత్నిస్తున్న మహీంద్రా ప్రస్తుతం ఇన్నోవా క్రిస్టా వాహనానికి పోటీని సృష్టిస్తోంది. తాజాగా దీనిని పరీక్షిస్తూ డ్రైవ్‌స్పార్క్ మీడియా కంటబడింది. ప్రొడక్షన్ దశకు చేరుకున్న ఈ వాహనానికి బెంగళూరులో యు321 అనే కోడ్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది.
Recommended Video


మహీంద్రా విపణిలో ఉన్న జైలో ఎస్‌యూవీ ఆధారంగా ప్రీమియమ్ డిజైన్ లక్షణాలతో ప్రపంచ శ్రేణి ఫీచర్లను అందించి ప్రీమియమ్ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో తిరులేని విజాయన్ని అందుకున్న ఇన్నోవా క్రిస్టాకు గట్టి పోటీగా రూపొందిస్తోంది. యు321 వెహికల్‌ను మహీంద్రా ఉత్తర అమెరికా బృందం అభివృద్ది చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ ఫ్రంట్ గ్రిల్ తరహాలో ఎనిమిది స్లాట్లున్న ఫ్రంట్ గ్రిల్ దీనికి మధ్యలో మహీంద్రా లోగో, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ దీని ప్రధాన పోటిని పోలి ఉంది. రియర్ డిజైన్ కొత్తగా ఉన్నప్పటికీ, పాత తరం స్కార్పియోలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ అందించినట్లు తెలుస్తోంది.

సాంకేతిక విశయాలకు వస్తే, మహీంద్రా యు321 టెక్నికల్ వివరాలు వెల్లడవ్వలేదు. అయితే, 2.0-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌హాక్ టుర్బో డీజల్ ఇంజన్ మరియు మహీంద్రా వారి భాగస్వామ్యపు సంస్థ శాంగ్‌యాంగ్ అభివృద్ది చేసిన 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా యు321 ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 2018 నాటికి ప్రొడక్షన్ దశకు చేరుకుని విపణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం నాశిక్‌లో ఉన్న ప్రొడక్షన్ ప్లాంటులో దీని అభివృద్ది కోసం మహీంద్రా నిధులు భారీగా వెచ్చిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టాకు మహీంద్రా కోలుకోలేని దెబ్బవేయడానికి ప్రయత్నిస్తోంది. విదేశీ డిజైన్ బృందం చేత రూపొందుతున్న యు321 ను మహీంద్రా ప్రణాళిక ప్రకారం రూ. 10 నుండి 15 లక్షల ధరల శ్రేణిలో విడుదల చేస్తే ఇన్నోవా కు గట్టి పోటీనివ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications








