జిటిసి4 లుస్సో ఇండియా విడుదల తేదీని వెల్లడించిన ఫెరారి

Written By:

ఇటాలియన్‌కు చెందిన అగ్రగామి సూపర్ కార్ల తయారీ సంస్థ ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు ఇండియా విడుదలపై స్పష్టతనిచ్చింది. తాజాగా అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం, ఆగష్టు 2, 2017 న ముంబాయ్ వేదికగా ఇండియన్ సూపర్ కార్ల మార్కెట్లోకి ఫెరారి జిటిసి4 లుస్సో కారు విడుదల కానుంది.

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు 4.5 నుండి 5 కోట్ల ధరల శ్రేణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఫీచర్లను కలిగి ఉన్న ఆల్ వీల్ డ్రైవ్ ఫోర్ సీటర్ జిటిసి4 లుస్సోను ప్రవేశపెట్టడానికి సిద్దమవగా, ఇదే ఫోర్ సీటింగ్ కెపాసిటితో కేవలం రియర్ వీల్ డ్రైవ్‌తో మాత్రమే ఆలస్యంగా విపణిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Recommended Video - Watch Now!
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, పదునైన ఫ్రంట్ డిజైన్, అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్, రియర్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న డిఫ్యూసర్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ గల జిటిసి4 లుస్సో ప్రస్తుతం దేశీయ విపణిలో ఉన్న ఎఫ్ఎఫ్ కారు స్థానాన్ని భర్తీ చేయనుంది.

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

జిటిసి4 లుస్సో పేరులో జిటిసి అనగా గ్రాండ్ టురిస్మో కూపే అని అర్థం, పేరులో ఉన్న 4 ఫోర్ వీల్ డ్రైవ్ మరియు ఫోర్ సీటింగ్ కెపాసిటి‌ని సూచిస్తుంది. మరియు లుస్సో అనగా ఇటాలియన్ భాషలో లగ్జరీ అని అర్థం. ఫెరారి జిటిసి4 లుస్సో కారును ఫెరారి గ్రాండ్ టురిస్మో కూపే 4 లగ్జరీ కారు అని కూడా పిలవొచ్చు.

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

జిటిసి4 లుస్సో ఇంటీరియర్‌లో ప్యాసింజర్ల కోసం సెపరేట్‌గా ఉన్న 10.25-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. సాంకేతికంగా ఇందులో ఎఫ్140 65-డిగ్రీ వి12 ఇంజన్ కలదు.

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 681బిహెచ్‌పి పవర్ మరియు 697ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 345కిలోమీటర్లుగా ఉంది.

ఫెరారి జిటిసి4 లుస్సో సూపర్ కారు

జిటిసి4 లుస్సో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ ఈ సూపర్ కారులోని అన్ని చక్రాలకు చేరుతుంది. కారులోని ఫ్రంట్ వీల్స్ కోసం ప్రత్యేకంగా 2-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. అదే విధంగా స్టీరింగ్ అనుసంధానం ఫ్రంట్ వీల్స్‌కు మాత్రమే కాకుండా రియర్ వీల్స్‌కు కూడా ఉంది. గంటకు 100కిలోమీటర్ల వేగం లోపు ఉన్నపుడు, స్టీరింగ్ ఆపరేట్ చేస్తే ముందు చక్రాలు తిరిగే దిశకు వెనుక చక్రాలు 2-డిగ్రీల వరకు వ్యతరేక దిశలో తిరగడం జరుగుతుంది.

English summary
Read In Telugu: Ferrari GTC4 Lusso India Launch Date Confirmed

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark