ఫియట్ పుంటో సేఫ్టీ టెస్ట్: దారుణమైన ఫలితాలు!!
సురక్షితమైన కార్లను తయారు చేసే సంస్థగా మంచి పేరు దక్కించుకున్న ఫియట్ సంస్థ ఘోర పరభవాన్ని చవిచూసింది. తాజాగా తమ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారుకు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో జీరో రేటింగ్‌కే పరిమితమైంది.
ఫియట్ కంపెనీ విక్రయించే కార్లకు ఇండియాలో చాలా కొద్ది మంది మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారు. కారు సేఫ్టీ గురించి అవగాహన ఉన్న వారు మాత్రమే ఫియట్ కార్లను ఎంచుకుంటారు. భద్రత పరంగా ఫియట్ కార్లు బెస్ట్ అని మంచి మార్కులు తెచ్చుకుంది.

సురక్షితమైన కార్లను తయారు చేసే సంస్థగా మంచి పేరు దక్కించుకున్న ఫియట్ సంస్థ ఘోర పరభవాన్ని చవిచూసింది. తాజాగా తమ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారుకు నిర్వహించిన క్రాష్ పరీక్షల్లో జీరో రేటింగ్‌కే పరిమితమైంది.
Recommended Video


డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు ఉన్న ఫియట్ పుంటో హ్యాచ్‌బ్యాక్ కారుకు యూరో ఎన్‌సిఎపి ఆధ్వర్యంలో నిర్వహించిన సేఫ్టీలో విఫలమైంది. సేఫ్టీ టెస్ట్ నిర్వహించిన క్రాష్ ఏజెన్సీ ఫియట్ పుంటోకు జీరో స్టార్ రేటింగ్ ఇచ్చింది.

ఫోర్ వీలర్ల పరిశ్రమ శరవేగంగా అభివృద్ది చెందుతున్న తరుణంలో సురక్షితమైన మరియు ఉత్తమమైన కార్ల వైపే కస్టమర్లు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్ల భద్రత పరంగా కంపెనీలు ఎక్కువ శ్రద్ద చూపాలి. భద్రత గాలికి వదిలేసి నామమాత్రపు ప్రమాణాలతో డిజైన్ చేస్తున్నాయి.

ఫియట్ పరీక్షించిన పుంటో కారు జీరో రేటింగ్స్ పొందడం ఇప్పుడు ఇండియన్ కస్టమర్లలో స్వల్ప అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఫియట్ కంపెనీ కారును ఎంచుకునే కస్టమర్లు ఎక్కువగా పుంటో కోసమే చూస్తున్నారు.

చాలా దేశాలు భద్రత పరంగా ఎన్నో నాణ్యతా ప్రమాణాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. మార్కెట్లో ఉన్న పోటీ, కస్టమర్ల అవసరాలు మరియు ఆయా ప్రభుత్వాల ప్రమాణాలను పాటించే విధంగా అభివృద్ది చేసే మోడళ్లకే అధిక డిమాండ్ ఉంటుంది.
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న పుంటో 2005లో అభివృద్ది చేసినది. ప్రస్తుత ప్రమాణాలతో పోల్చుకుంటే ఇది అవుట్ డేటెడ్ మోడల్. యూరో ఎన్‌సిఎపి జనరల్ సెక్రెటరీ, మైఖేల్ వ్యాన్ రేటింగెన్ మాట్లాడుతూ, కస్టమర్లు కార్లను కొనుగోలు చేసే ముందు కార్లలో ఉన్న సేఫ్టీ ఫీచర్లతో పాటు, ఆ కార్ల యొక్క క్రాష్ టెస్ట్ ఫలితాలను కూడా గమనించి ఎంచుకోవడం మంచిదని తెలిపాడు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఫియట్ పుంటో సుమారుగా దశాబ్దానికి పైగా పాతది. మారిని ప్రమాణాలతో పోల్చితే ఫియట్ పుంటో చాలా వీక్‌గా ఉంది. ఈ కారణంతోనే యూరో ఎన్‌సిఎపి సేఫ్టీ పరీక్షల్లో జీరో రేటింగ్ పొందింది.
ఫియట్ దక్షిణ అమెరికా మార్కెట్లో పుంటో స్థానంలోకి ఆగ్రో హ్యాచ్‍బ్యాక్ కారును పరిచయం చేసింది. ఇండియన్ మార్కెట్లో కూడా పుంటో స్థానంలోకి ఆగ్రో కారు రానుంది. సేఫ్టీ కార్లకు చిరునామాగా మారిన ఫియట్ ఈసారైనా మెరుగైన భద్రతా ప్రమాణాలు పాటించిన మోడళ్లను ఉత్పత్తి చేసి, క్రాష్ పరీక్షల్లో మళ్లీ తననుతాను నిరూపించుకుంటుందో... లేదో... చూడాలి మరి.


Click it and Unblock the Notifications








