డీలర్ల వద్దకు క్యూ కట్టిన టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ తొలి బ్యాచ్ నెక్సాన్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ ఎస్‌యూవీలు డీలర్లకు చేరనున్నాయి.

By Anil

టాటా మోటార్స్ తొలి బ్యాచ్ నెక్సాన్ ఎస్‌యూవీలను ఉత్పత్తి చేసినట్లు ప్రకటించింది. ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ ఎస్‌యూవీలు డీలర్లకు చేరనున్నాయి. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మహారాష్ట్రలోని రంజన్‌గావ్‌ ప్రొడక్షన్ ప్లాంటులో నెక్సాన్‌ను ఉత్పత్తి చేస్తోంది.

డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ద్వారా కొత్త జనరేషన్ ప్యాసింజర్ కార్లను ఉత్పత్తి చేస్తున్న టాటాకు నెక్సాన్ ఎస్‌యూవీ నాలుగవ ఉత్పత్తి. అంతే కాకుండా కొత్త సెగ్మెంట్లో ప్రవేశిస్తూ, స్పోర్టివ్ ఎస్‌యూవీ, రాజీపడని ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో నెక్సాన్‌ను రూపొందించింది.

Recommended Video

Honda Cliq Review In Telugu - DriveSpark తెలుగు
డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

కస్టమర్లు నెక్సాన్ ఎస్‌యూవీని రెండు ఇంజన్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు. అవి, 1.2-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌ వేరియంట్లలో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

ఇంజన్ పనితీరు గురించి క్షుణ్ణంగా పరీశీలిస్తే, నెక్సాన్ లోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును, అదే విధంగా నెక్సాన్ లోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల రివోటార్క్ ఇంజన్ 108బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

ప్రస్తుతం విపణిలో భారీ విక్రయాలు సాధిస్తున్న వితారా బ్రిజాలో 1.3-లీటర్ డీజల్ ఇంజన్ మాత్రమే ఉంది. ఇది 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వితారా బ్రిజాతో పోల్చుకుంటే నెక్సాన్ డీజల్ ఎంతో శక్తివంతమైనది. అదే విధంగా బ్రిజాలో 5-స్పీడ్ మ్యాన్యువల్, నెక్సాన్‌లో 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కలదు.

డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

టాటా మోటార్స్ ఇప్పుడు నెక్సాన్ ఎస్‌యూవీలను డీలర్లకు చేర్చే పనిలో ఉంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన టాటా షోరూమ్‌లలో నెక్సాన్ సందడి ఇప్పటికే మొదలైంది. మరికొన్ని విక్రయ కేంద్రాల్లో అనధికారికంగా బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి.

డీలర్ల వద్దకు టాటా నెక్సాన్ ఎస్‌యూవీలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో అద్బుతమైన డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్లతో పాటు శక్తివంతమైన ఇంజన్ వేరియంట్లలో వస్తున్న నెక్సాన్ టాటా మోటార్స్‌కు సంచలనాత్మక విజయం తెచ్చిపెట్టనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: First Batch Of Tata Nexon Rolls Out Of Tata’s Ranjangaon Plant, SUV To Be Displayed At A Dealership
Story first published: Friday, July 21, 2017, 10:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X