ప్రపంచంలోకెల్లా అరుదైన కారు ఇప్పుడు ఇండియాలో

Written By:

దాదాపు రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్ 2015 లో ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ సూపర్ కారును ఆవిష్కరించింది. అత్యాధునిక ఏరోడైనమిక్ డిజైన్ 720బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే, రెండు సీట్ల ఫెరారి జిటి మ్యాడ్‌నెస్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు. ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ లో టిడిఎఫ్ అనగా టూర్ డి ఫ్రాన్స్ ఎండ్యూరెన్స్ రేస్ అని అర్థం.(అతి ప్రధానమైన మోటార్ రేసింగ్‌లలో ఇది ఒకటి.)

ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

ఫెరారి సంస్థ కేవలం 799 యూనిట్ల ఎఫ్12టిడిఎఫ్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. భూమ్మీద అత్యంత అరుదైన కార్లలో ప్రస్తుతం ఇదీ ఒకటి. ప్రపంచంలోనే అరుదైన సూపర్ కారుగా చెప్పుకునే ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది.

Recommended Video - Watch Now!
2017 Skoda Octavia RS Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుమతి చేస్తున్నపుడు తీసిన కొన్ని ఫోటోలు ప్రఖ్యాతగాంచిన ఫేస్‌బుక్ పేజీల్లో సందడి చేస్తున్నాయి. కోట్ల రుపాయలు విలువ చేసే మరియు అరుదైన సూపర్ కారును ఇండియాకు రావడం అంటే మాటలా... అందులో కూడా దీనిని ఎవరు కొనుగోలు చేశారు అనే ఉత్కంఠ కూడా ఉంటుంది.

ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

ప్రస్తుతానికి, ఈ కారును ఎవరు కొనుగోలు చేశాడనే విషయం తెలియరాలేదు, అయితే దీనిని ఢిల్లీ నుండి కలకత్తాకు తరలిస్తున్నట్లు తెలిసింది. అంటే కలకత్తా ఆధారిత వ్యాపారవేత్త కొనుగోలు చేసి ఉండే అకాశం ఉంది.

ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

ఫెరారి ఎఫ్2టిడిఎఫ్ కారులో సాంకేతికంగా 6.3-లీటర్ల సామర్థ్యం గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 769బిహెచ్‌పి పవర్ మరియు 6,250ఆర్‌పిఎమ్ వద్ద 705ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉంది.

ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

ఎఫ్12టిడిఎఫ్ కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది, అదే విధంగా 200కిలోమీటర్ల వేగాన్ని ఐదు సెకండ్ల వ్యవధిలోనే అందుకుంటుంది. ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ గరిష్ట వేగం గంటకు 340కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఫెరారి ఎఫ్12టిడిఎఫ్ టిడిఎఫ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశపు తొలి మెక్‌లారెన్ కారును ఇండియాలోకి దిగుమతి అయిన తరువాత, అరుదైన కారుగా ఉన్న ఫెరారి ఎఫ్12టిడిఎప్ కారు భారతదేశపు తొలిఎఫ్12టిడిఎఫ్ కారుగా విపణిలోకి దిగుమతి అయ్యింది. ఒకే వారంలో రెండు అత్యంత ఖరీదైన కార్లను దేశీయ సూపర్ కార్ల కస్టమర్లు ఎంచుకున్నారు. ఇండియన్ మార్కెట్లో సూపర్ కార్ల కొనుగోలుదారుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని చెప్పవచ్చు.

English summary
Read In Teulgu: India's First Ferrari F12tdf Is Finally Here
Story first published: Sunday, September 3, 2017, 11:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark