భారతదేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారును కొనుగోలు చేసిన బెంగళూరు వాసి

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రంజిత్ సుందరమూర్తి మెంఫిస్ రెడ్ కలర్ మెక్‌లారెన్ 720ఎస్ కారును కొనుగోలు చేసాడు.

By Anil

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్‌లారెన్ భారత దేశపు తొలి కారుగా ఇండియన్ కస్టమర్‌కు విక్రయించింది. మెక్‌లారెన్ ఈ ఏడాది మార్చిలో జరిగిన 2017 జెనీవా మోటార్ షో వేదిక మీద మెక్‌లారెన్ 720ఎస్ కారును ఆవిష్కరించింది.

భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రంజిత్ సుందరమూర్తి మెంఫిస్ రెడ్ కలర్ మెక్‌లారెన్ 720ఎస్ కారును కొనుగోలు చేసాడు. భారత దేశపు తొలి మెక్‌లారెన్ కారును కొనుగోలు చేసిన వ్యక్తిగా రంజిత్ నిలిచారు.

Recommended Video

2018 Bentley Continental GT Revealed | In Telugu - DriveSpark తెలుగు
భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

మెక్‌లారెన్ 720ఎస్ కారులో మూడు పర్ఫామెన్స్ ప్యాకులు ఉన్నాయి. తేలికపాటి బరువు కోసం కారు బాడీ మొత్తాన్ని కార్బన్ ఫైబర్‌తో మరియు అల్కంటారా ఇంటీరియర్ ఇందులో ఉంది.

భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

సాంకేతికంగా మెక్‌లారెన్ 720ఎస్ కారులో 4.0-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ కలదు. దీనికి అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 710బిహెచ్‌పి పవర్ మరియు 770ఎన్ఎమ్ టార్క్ వెనుక చక్రాలకు అందుతుంది.

భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

మెక్‌లారెన్ 720ఎస్ కేవలం 2.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని మరియు 4.9 సెకండ్ల వ్యవధిలో 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు దీని గరిష్టం వేగం గంటకు 341కిలోమీటర్లుగా ఉంది.

భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

బెంగళూరులోని రంజిత్ సుందరమూర్తి నివాసంలో ఉన్న ఇతర సూపర్ల జాబితాలోకి మెక్‌లారెన్ 720ఎస్ చేరనుంది. రంజిత్ వద్ద మెక్‌లారెన్ 720ఎస్‌తో పాటు ఫెరారి 458 ఇటాలియా, ఫెరారి 488 జిటిబి మరియు ల్యాంబోర్గిని హురాకాన్ వంటి సూపర్ కార్లు ఉన్నాయి.

భారత దేశపు మొట్టమొదటి మెక్ లారెన్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్ దేశపు తొలి మెక్‌లారెన్ కారుగా నిలిచిన 720ఎస్ కారు మెక్‌లారెన్ ఫ్యాక్టరీలో తయారవుతున్న అత్యాధునిక మోడల్ కావడం విశేషం. దుబాయ్‌లో డెలివరీ తీసుకుని ఇండియాలోని బెంగుళూరుకు తెప్పించాడు. అయితే ఈ కారులో ఎడమవైపున స్టీరింగ్ వీల్ ఉందన్న కారణం చేత మళ్లీ దుబాయ్‌లోని తన నివాసానికి పంపుతున్నట్లు తెలిసింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 31, 2017, 18:39 [IST]
English summary
Read In Telugu: This Is India's First-Ever McLaren, owned by Bangalore businessman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+