2017 స్విఫ్ట్ డిజైర్‌లో రానున్న ఐదు కొత్త ఫీచర్లు

Written By:

మారుతి సుజుకి తమ తరువాత తరం సబ్ కాంపాక్ట్ సెడాన్‌ స్విఫ్ట్ డిజైర్‌ను ఏడాది మే నెలలో మార్కెట్లో విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఎక్ట్సీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందులో రానున్న అతి ముఖ్యమైన ఫీచర్లు ఇవాళ్టి కథనంలో....

పగటిపూట వెలిగే లైట్ల జోడింపుతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్

పగటిపూట వెలిగే లైట్ల జోడింపుతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్

ప్రస్తుతం ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోని టాటా జెస్ట్ మరియు అతి త్వరలో విడుదల కానున్న టాటా టిగోర్ కార్లలో మాత్రమే పగటి పూట వెలిగే లైట్ల మేళవింపుతో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అయితే మారుతి సుజుకి తమ తరువాత తరం స్విఫ్ట్ డిజైర్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఈ ఫీచర్ తీసుకురానుంది.

మరింత క్యాబిన్ స్పేస్

మరింత క్యాబిన్ స్పేస్

స్విఫ్ట్ డిజైర్ విడుదలైన తొలినాళ్లలో ఎక్కువ క్యాబిన్ స్పేస్ గల కారుగా నిలిచింది. అయితే ప్రస్తుతం ఉన్న పోటీదారుల ముందు దీని క్యాబిన్ స్పోస్ అంత ఎక్కువేం లేదు. అందుకోసం మరింత క్యాబిన్ స్పేస్ కల్పించడం మీద మారుతి సుజుకి దృష్టి సారించింది. మారుతి తమ మూడవ తరానికి చెందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగానే దీనికి క్యాబిన్ అందిస్తోంది.

తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

2017 స్విఫ్ట్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ ఆపిల్ కార్ ప్లే మరియు బిల్ట్ ఇన్ న్యావిగేషన్ సిస్టమ్ లతో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో రానుంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందివ్వడం స్విఫ్ట్ డిజైర్ ఇంటీరియర్ మరింత ప్రీమియమ్ లుక్‌ను సొంతం చేసుకోనుంది.

మరింత బూట్ స్పేస్ (లగేజ్ స్పేస్)

మరింత బూట్ స్పేస్ (లగేజ్ స్పేస్)

ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న స్విఫ్ట్ డిజైర్ యొక్క బూట్ స్పేస్ దాని పోటీదారుల కంటే తక్కువగానే ఉంది. అయితే మారుతున్న కాలానుగుణంగా ఎక్కువ బుట్ స్పేస్ కల్పించేందుకు సీట్లను స్లిమ్ముగా రూపొందిస్తోంది. తద్వారా ప్యాసింజర్లకు ఎక్కువ రూమ్ స్పేస్ మరియు లగేజ్ కోసం ఎక్కువ బూట్ స్పేస్ అందివ్వడానికి వీలవుతుంది.

కూల్డ్ గ్లోవ్ బాక్స్

కూల్డ్ గ్లోవ్ బాక్స్

రానున్న రోజుల్లో ఎండలు బాగా పెరుగుతన్న కారణంగా కార్లలో కూల్డ్ గ్లోవ్ బాక్స్ ఖచ్చితంగా కావాల్సిన అవసరం వస్తోంది. మారుతి తమ స్విఫ్ట్ డిజైర్‌లో కూల్డ్ గ్లూవ్ బాక్స్ అందిస్తే, ఈ సెగ్మెంట్లోనే ఇది మొదటి కారు కానుంది. కారులో ఉన్న ఏ/సి ద్వారా గ్లోవ్ బాక్స్ చల్లగా ఉంటుంది.

2017 మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కొత్త ఫీచర్లు

అలర్ట్: మారుతి సుజుకి డిజైర్ కొంటున్నారా...?

 

English summary
Five Features You Should Know About The 2017 Maruti Suzuki Swift Dzire
Story first published: Monday, March 27, 2017, 18:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark