1.2 లక్షల వరకు పెరగనున్న ఫోర్డ్ కార్ల ధరలు

తాజాగా అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా విభాగం దేశీయంగా అందుబాటులో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద ధరల పెంపును ప్రకటించింది.

By Anil

గత వారం రోజులుగా ఒక్కో కార్ల కంపెనీ 2018 జనవరి నుండి ధరల పెంపు మీద నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో, తాజాగా అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ ఇండియా విభాగం కూడా దేశీయంగా అందుబాటులో ఉన్న తమ అన్ని మోడళ్ల మీద ధరల పెంపును ప్రకటించింది.

ఫోర్డ్ కథనం మేరకు, ఇండియా లైనప్‌లో లభించే అన్ని మోడళ్ల మీద నాలుగు శాతం వరకు ధరలు పెంచనున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ కార్ల ధరలు

ఫోర్డ్ ఇండియా ఫోర్ట్‌ఫోలియోలో ఉన్న మస్టాంగ్ మినహా అన్ని కార్ల ధరలు ఓ మోస్తారుగా పెరగనున్నాయి. ఫోర్డ్ ఫిగో, ఫిగో ఆస్పైర్, ఇకోస్పోర్ట్ మరియు ఎండీవర్ వంటి మోడళ్ల మీద 2018 ప్రారంభం నుండి తప్పనిసరిగా ధరలు పెరగనున్నాయి.

Recommended Video

This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
ఫోర్డ్ కార్ల ధరలు

కనిష్టంగా రూ. 20,000 ల నుండి గరిష్టంగా రూ. 1.2 లక్షల వరకు ధరలు పెరగవచ్చు. ఎంట్రీ లెవల్ మోడల్ ఫిగో నుండి హై ఎండ్ మోడల్ అయిన ఎండీవర్ ఎస్‌యూవీ వరకు పెంపు వర్తిస్తుంది.

ఫోర్డ్ కార్ల ధరలు

ఫోర్డ్ ఈ ఇటీవల విడుదల చేసిన కొత్త తరం ఇకోస్పోర్ట్ ఎస్‌యూవీ ధర రూ. 30,000 ల వరకు పెరిగే అవకాశం ఉంది. ఫోర్డ్ వారి కాంపాక్ట్ సెడాన్ ఫిగో ఆస్పైర్ మీద రూ. 25,000 ల వరకు ధర పెరగనుంది.

ఫోర్డ్ కార్ల ధరలు

ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్ మరియు సేల్స్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ వినయ్ రైనా మాట్లాడుతూ, "పెట్టుబడి, తయారీ భారం పెరగడం మరియు దిగుమతి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వచ్చిన ఇబ్బందులను ఎదుర్కోవడానికి ధరల సవరణ తప్పడం లేదని వెల్లడించారు."

ఫోర్డ్ కార్ల ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 జనవరి నుండి కార్ల విక్రయాలు గణనీయంగా పెరగనున్నాయి. 2017 కాకుండా 2018 ఏడాదిలో తయారైన కార్లను ఎంచుకోవడానికి కస్టమర్లు ఆసక్తికనబరుస్తున్నారు. ఈ తరుణంలో డిసెంబర్ ఆఫర్లతో 2017 మోడల్ కార్లను విక్రయించి, 2018 నుండి ధరల పెంపుతో కవర్ చేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. అందులో భాగంగానే ప్రతి ఏడాది ప్రారంభంలో కంపెనీలు ధరల పెంపును ప్రకటిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 14, 2017, 11:51 [IST]
English summary
Read In Telugu: Ford Car Prices: EcoSport, Figo & Endeavour Prices To Increase — Here Are The Complete Details
Read more on: #ford #ఫోర్డ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+