డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లతో దాడికి దిగుతున్న ఫోర్డ్

అమెరికన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ తమ డ్రాగన్ కుటుంబంలో ఉన్న పెట్రోల్ ఇంజన్‌లను దేశీయంగా ఉన్న తమ అన్ని కార్లలో అందించే ఆలోచనలో ఉంది.

By Anil

అమెరికన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ తమ డ్రాగన్ కుటుంబంలో ఉన్న పెట్రోల్ ఇంజన్‌లను దేశీయంగా ఉన్న తమ అన్ని కార్లలో అందించే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా తొలుత ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ నుండి సేకరించిన పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనుంది.

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

ఫోర్డ్ భారత్ మార్కెట్‌ను డ్రాగన్ ఫ్యామిలీ పెట్రోల్‌ ఇంజన్‌ల ప్రొడక్షన్ హబ్‌గా చేసుకోవాలని భావిస్తోంది. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన మరికొన్ని వారాల్లో వెలువడనుంది.

డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు అంటే ఏమిటి అనుకుంటున్నారా....? ఫోర్డ్ ప్రత్యేకంగా పెట్రోల్ ఇంజన్‌లను డ్రాగన్ సిరీస్(డ్రాగన్ ఫ్యామిలీ) పేరుతో అభివృద్ది చేసింది. అత్యుత్తమ పరిజ్ఞానంతో, ఆధునిక సాంకేతికతతో వీటిని అభివృద్ది చేసింది.

Recommended Video

2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

ఫోర్డ్ ఇండియా డ్రాగన్ కుటుంబంలోకి ఉన్న 1.5-లీటర్ మరియు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు వచ్చే అవకాశం ఉంది. ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 120బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. త్వరలో విడుదల కానున్న ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్ ద్వారా ఈ ఇంజన్‌ను పరిచయం చేయనుంది.

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీలోని 1.2-లీటర్ ఇంజన్‌ను 2019లో విడుదల కానున్న నెక్ట్స్ జనరేషన్ ఫిగో హ్యాచ్‌బ్యాక్ మరియు ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్‌లలో అందించే అవకాశం ఉంది. చిన్న పెట్రోల్ ఇంజన్ ఉండటంతో తక్కువ ట్యాక్స్ పడుతుంది. దీంతో ఫేస్‌లిఫ్ట్ ఎకోస్పోర్ట్‌లో బేస్ వేరియంట్‌గా 1.2-లీటర్ డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ రానుంది.

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

ఇప్పటి వరకు ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ పెట్రోల్ ఇంజన్‌ల గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు, అయితే భవిష్యత్తులో ప్రపంచ దేశాలు అమలు చేసే అత్యంత కఠినమైన ఉద్గార నియమాలను పాటించే సామర్థ్యం ఈ ఇంజన్‌లకు ఉందని తెలుస్తోంది.

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లు భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్, హైడ్రోడైనమిక్ బేరింగ్స్ గల రాకర్ షాఫ్ట్, వేరిబుల్ ఆయిల్ పంప్ మరియు డ్యూయల్-వాల్వ్ ఇండిపెండెంట్ వాల్వ్ కంట్రోల్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రానున్నాయి.

ఫోర్డ్ డ్రాగన్ ఫ్యామిలీ ఇంజన్‌లు

ఫోర్డ్ ఈ కొత్త ఇంజన్‌లను సనంద్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. డ్రాగన్ ఫ్యామిలీకి చెందిన ఈ ఇంజన్‌లతో వచ్చే కార్లు అధిక పవర్ మరియు మైలేజ్‌తో పాటు తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రాగన్ ఫ్యామిలీకి చెందిన ఇంజన్‌లు నిజంగా శక్తివంతమైనవి మరియు అధిక ఇంధన సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్‌ ఆప్షన్లతో ఎకోస్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్‌ విడుదలైతే మారుతి సుజుకి వితారా బ్రిజా మీద పోటీ పెరగడం గ్యారంటీ..

More from DriveSpark

Article Published On: Saturday, August 5, 2017, 16:53 [IST]
English summary
Read In Telugu: Ford To Debut New Dragon Family Petrol Engines In India
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+