ఎకోస్పోర్ట్ ప్లాటినమ్ ఎడిషన్ విడుదల చేసిన ఫోర్డ్
పోర్డ్ మోటార్స్ దేశీయంగా ప్లాటినమ్ ఎడిషన్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యువిని విడుదల చేసింది. నూతన సంవత్సరంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కొన్ని నూతన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లను జోడించింది.
ఫోర్డ్ ఇండియా దేశీయంగా విపణిలోకి ఎకోస్పోర్ట్ ప్లాటినమ్ ఎడిషన్ విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ మరియు మెండైన ప్లాటినమ్ ఫీచర్లతో విడుదలైన ఎకో స్పోర్ట్ లోని పెట్రోల్ వేరియంట్ ధర రూ. 10.69 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ.10.69 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఫోర్డ్ నిర్ణయించింది.

నూతన ఏడాదిలో తమ కాంపాక్ట్ ఎస్‌యువి ఎకోస్పోర్ట్ ను అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ మీద ప్లాటినమ్ ఎడిషన్ అని తెలియజేసే సొబగుల జోడింపుతో నూతనత్వాన్ని కోరుకునే కస్టమర్లకు 2017 ఎకోస్పోర్ట్ ప్లాటినమ్ ఎడిషన్ ఎస్‌యువిని అందుబాటులోకి తెచ్చినట్లు ఫోర్డ్ ఇండియా మార్కెటింగ్ విభాగాధిపతి అనురాగ్ మెహ్రోత్రా తెలిపారు.

సాంకేతిక వివరాలు
కస్టమర్లు ప్లాటినమ్ ఎడిషన్ ఎకోస్పోర్ట్ ఎడిషన్‌ను 1.5-లీటర్ టిడిసిఐ డీజల్ మరియు 1.0-లీటర్ సామర్థ్యం గల ఎకో బూస్ట్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ఎంచుకోగలరు. ఈ రెండు ఇంజన్‌లు యొక్క సాంకేతిక అంశాలలో ఎలాంటి మార్పు లేదు.

డిజైన్
ఫోర్డ్ ఇండియా ప్లాటినమ్ ఎడిషన్ ఎకోస్పోర్ట్ ఎస్‌యువి ఎక్ట్సీరియర్‌ను డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌తో మరింత అగ్రెసివ్‌గా డిజైన్ చేసింది. నూతన కస్టమర్లను ఆకర్షించే విధంగా బ్లాక్ కలర్‌తో అభివృద్ది చేయబడిన రూఫ్ టాప్, పెద్ద పరిమాణంలో ఉన్న 17-అంగుళాల అల్లాయ్ చక్రాలు వీటికి వెడల్పాటి టైర్లను అందివ్వడం జరిగింది.

ఫీచర్లు
ఇంటీరియర్ విషయానికి వస్తే మునుపటి ఇంటీరియర్ ను పరిశీలించిన వారికి ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇందులోని 8-అంగుళాల తాకే తెర పరిమాణం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

దీని ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను నియంత్రించే అవకాశాన్ని కల్పించింది. క్రూయిజ్ కంట్రోల్, మ్యాజిక్ మరియు ఆడియో లను ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆధారంగా ప్లే చేయవచ్చు.

ఈ ప్లాటినమ్ ఎడిషన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యువి లోని డీజల్ ఇంజన్ లీటర్‌కు 22.27 కిలోమీటర్లు మరియు పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 18.88 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

సాధారణ ఇంజన్‌లతో పోల్చుకుంటే ఎకోబూస్ట్ ఇంజన్‌లు ఉత్తమ పవర్ ఉత్పత్తి చేయును. ప్లాటినమ్ ఎకోస్పోర్ట్ లోని 1.0-లీటర్ ఎకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ 124బిహెచ్‌పి పవర్ మరియు ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

అరగంటలోనే చెన్నై నుండి బెంగళూరుకు
హైపర్ లూప్ ఇప్పుడు దేశీయంగా హాట్‌టాపిక్ గా మారింది. గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ లూప్ రవాణా మార్గాన్ని చెన్నై-బెంగళూరు మధ్య నిర్మించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి


Click it and Unblock the Notifications








