ఎండీవర్ నుండి రెండు వేరియంట్లను తొలగించిన ఫోర్డ్

ఎండీవర్‌లో తాజాగా రెండు వేరియంట్లను తొలగించడంతో పాటు, అందుబాటులో ఉండే ఎండీవర్‌ వేరియంట్ల మీద ధర తగ్గించిన ఫోర్డ్

By Anil

ఫోర్డ్ ఇండియా విభాగంలో తమ ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీని విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అయితే వాటికి లభిస్తున్న ఆదరణ దృష్ట్యా ఆశించని ఫలితాలను కనబరచని వేరియంట్లను ఒక్కొక్కటిగా తొలగించడం ప్రారంభించింది.

ఎండీవర్‌లో తాజాగా రెండు వేరియంట్లను తొలగించడంతో పాటు, అందుబాటులో ఉండే ఎండీవర్‌ వేరియంట్ల మీద ధర తగ్గించిన ఫోర్డ్. ఆ వివరాలు పూర్తిగా నేటి కథనంలో...

ఎండీవర్‌లో రెండు వేరియంట్లకు స్వస్తి పలికిన ఫోర్డ్

గత ఏడాది ఫోర్డ్ ఎండీవర్ లోని 2.2-లీటర్ 4X2 ట్రెండ్ ట్రిమ్ వేరియంట్‌ను తొలగించింది. ఆ తరువాత ఐదు వేరియంట్లు ఉండగా, వాటిలో ఇప్పుడు రెండింటికి స్వస్తి పలికి ఆ సంఖ్యను మూడుకు తగ్గించింది.

ఎండీవర్‌లో రెండు వేరియంట్లకు స్వస్తి పలికిన ఫోర్డ్

ఎండీవర్‌లోని 2.2-లీటర్ 4X2 మ్యాన్యువల్ ట్రెండ్ మరియు 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ ట్రెండ్ వేరియంట్లను ఫోర్డ్ తొలగించింది. వీటి తొలగింపు అనంతరం ఉన్న వేరియంట్ల వివరాలు.

  • 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ ట్రెండ్,
  • 2.2-లీటర్ 4X2 ఆటోమేటిక్ టైటానియమ్,
  • 3.2-లీటర్ 4X4 ఆటోమేటిక్ టైటానియమ్.
  • ఎండీవర్‌లో రెండు వేరియంట్లకు స్వస్తి పలికిన ఫోర్డ్

    సందర్భాన్ని బట్టి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లను ఎప్పటికప్పుడు లైనప్‌ నుండి తొలగించుకుంటూ రావడంతో, ఎండీవర్‌ను కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో మాత్రమే ఎంచుకోగలం.

    ఎండీవర్‌లో రెండు వేరియంట్లకు స్వస్తి పలికిన ఫోర్డ్

    ఎండీవర్ లోని వేరియంట్లను తొలగిస్తూ రావడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఆశించిన స్థాయిలో ఫలితాల లేకపోవడం ఇందుకు కారణం అని తెలిసింది. ఎండీవర్‌కు సరాసరి పోటీనిస్తున్న టయోటా ఫార్చ్చూనర్ నూతన ప్రణాళికలను పాటించడంతో ఎండీవర్‌ సేల్స్ తగ్గుముఖం పట్టాయి.

    ఎండీవర్‌లో రెండు వేరియంట్లకు స్వస్తి పలికిన ఫోర్డ్

    టయోటా ఫార్చ్యూనర్ తో ఫోర్డ్ ఎండీవర్‌ తీవ్ర పోటీని ఎదుర్కుంటోంది. ఫార్చ్యూనర్‌ను ఎదుర్కునే క్రమంలోనే డిమాండ్ లేని ఎండీవేరియంట్లను తొలగించడం జరిగింది. పెద్ద పెద్ద ఎస్‌యూవీలలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకునే వారే లేకపోవడం ఇక్కడ గమనించవచ్చు.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Read In Telugu Ford Discontinues Two Variants Of Endeavour In India
Story first published: Wednesday, June 21, 2017, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X