ఐ20, బాలెనో లకు పోటీని తీసుకొస్తున్న ఫోర్డ్

Written By:

అమెరికా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఫోర్డ్ కొత్త కార్లను తయారు చేయడానికి నూతన ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తోంది. ఇండియాతో పాటు అభివృద్ది చెందుతున్న మార్కెట్ల లక్ష్యంతో కొత్త ఉత్పత్తులను సిద్దం చేస్తోంది.

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లలోకి బి563 అనే కోడ్ పేరుతో ప్రారంభం కానున్న ప్లాట్‌ఫామ్ ఆధారంగా రెండు కొత్త కార్లను అభివృద్ది చేస్తోంది. దేశీయంగా ఉన్న మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఐ20 కార్లకు పోటీగా ఫోర్డ్ ఫిగో కు పైస్థానంలో సరికొత్త ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను అభివృద్ది చేస్తోంది.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఫోర్డ్ నుండి బాలెనో మరియు ఐ20 లకు పోటీ

ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారుకు కొనసాగింపుగా మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లోకి విడుదల చేయనుంది. 2015లో ఇండియన్ మార్కెట్ నుండి వైదొలగిన ఫోర్డ్ ఫియస్టా స్థానాన్ని భర్తీ చేస్తూ, రానున్న ఇది మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటి కార్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఫోర్డ్ నుండి బాలెనో మరియు ఐ20 లకు పోటీ

ఫోర్డ్ వద్ద ఉన్న డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లతో కొత్త కార్లను ఇండియా వేదికగా ప్రపంచ ఆవిష్కరణ చేయనుంది. 2023 నుండి రియల్‍‌గా ఉద్గారాలను పరీక్షించే వ్యవస్థ అందుబాటులోకి రానుంది. కఠినమైన ఈ ఉద్గార నియమాలను పాటించే సామర్థ్యం డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజన్‌లకు కలదు. అయితే, ఆ సమయానికి 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు కనుమరుగయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

ఫోర్డ్ నుండి బాలెనో మరియు ఐ20 లకు పోటీ

ఫోర్డ్ ఫిగో మరియు ఆస్పైర్ కార్లను అభివృద్ది చేసిన ప్రస్తుత బి562 ఫ్లాట్‌ఫామ్ ఆధారిత సరికొత్త బి563 ఫ్లాట్‌ఫామ్‌ను సిద్దం చేశారు. భవిష్యత్తులో అత్యుత్తమ నాణ్యతతో, తక్కువ ధరతో కొత్త కార్లను అందివ్వడానికి ఫోర్డ్ వారి కొత్త ఫ్లాట్‌ఫామ్ ఎంతగానో ఉపయోగపడనుంది.

ఫోర్డ్ నుండి బాలెనో మరియు ఐ20 లకు పోటీ

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫోర్డ్ ఇండియా విభాగానికి ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయి. దీనిని ఇలాగే కొనసాగించడానికి, ప్రస్తుతం మార్కెట్లోకి కీలకంగా ఉన్న ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ఉన్న బాలెనో, ఐ20 మరియు జాజ్ కార్లకు పోటీగా సరికొత్త కారును ప్రవేశపెట్టడానికి సిద్దమైంది. భవిష్యత్తులో ఈ సెగ్మెంట్లో పోటీ మరింత పెరగనుంది.

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Read In Telugu: Ford Developing New Premium Hatchback To Rival Maruti Baleno
Story first published: Friday, August 4, 2017, 15:53 [IST]
Please Wait while comments are loading...

Latest Photos