ప్యాసింజర్ కార్లలో ఇక మీదట ఈ ఐదు సేఫ్టీ ఫీచర్లు తప్పనిసరి: కేంద్రం

Written By:

ప్యాసింజర్ కార్ల భద్రత విషయంలో భారత ప్రభుత్వం కార్లలో కొన్ని సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 2019 నుండి కార్ల తయారీ సంస్థలు విక్రయించే ప్రతి కారులో కూడా అతి ముఖ్యమైన ప్రాథమిక భద్రత ఫీచర్లను తప్పనిసరిగా అందించాలని కేంద్రం స్పష్టం చేసింది.

సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్యాసింజర్ కార్ల కోసం ఆటోమొటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ లోని 145 వ ముసాయిదా నియమం ప్రకారం ప్యాసింజర్ కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లను తప్పనిసరిగా అందించాలని కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ ఓ నియమాన్ని జారీ చేసింది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్యాసింజర్ కార్ల కోసం ఆటోమొటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ లోని 145 వ ముసాయిదా నియమం ప్రకారం ప్యాసింజర్ కార్లలో ఉండాల్సిన అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లను తప్పనిసరిగా అందించాలని కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రిత్వ శాఖ ఓ నియమాన్ని జారీ చేసింది.

సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

ఇండియాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి మరియు రోడ్డు ప్రమాదాల ద్వారా జరిగే మరణాల రేటును తగ్గించేందుకు ఆటోమేటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్‌(AIS) 145 లో ఐదు ఫీచర్లను తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అవి,

  • సీట్ బెల్ట్ అలర్ట్,
  • సీట్ బెల్ట్ వార్నింగ్,
  • స్పీడ్ వార్నింగ్ సిస్టమ్,
  • డ్రైవర్ ఎయిర్ బ్యాగులు,మరియు
  • రివర్స్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్.
సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

కార్లు రివర్సింగ్‌లో ఉన్నపుడు చిన్న పిలల్లు కార్ల క్రిందకు వెళ్లడం, అధిక వేగంతో ప్రయాణించడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం వంటి సమస్యలను అధిగమించేందుకు ఈ ఫీచర్లను తప్పనిసరిగా అందించే లక్ష్యంతో AIS వీటిని తప్పనిసరి చేసింది.

సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

అంతే కాకుండా భవిష్యత్తులో ప్రతి కారు కూడా క్రాష్ టెస్టులో ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ పొందేలా కార్లను అభివృద్ది చేయాలి. అందుకోసం భారత్ ఎన్‌సిఎపి పేరుతో దేశీయంగా కార్లకు క్రాష్ టెస్టులు నిర్వహించనున్నారు.

సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

రానున్న మూడేళ్ల కాలంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి పైగా తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. అందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భద్రత నియమాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఇండియాలో విడుదలయ్యే కార్లలో వాటిని తప్పనిసరి చేయాలని భావిస్తోంది.

సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసిన కేంద్రం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే, ఏడాది సుమారుగా 1.5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో భద్రత ఫీచర్లను వినియోగించకపోవడం మరియు కఠినమైన భద్రతా ప్రమాణాలు లేకపోవడం ఇందుకు ప్రధానం కారణంగా చెప్పుకోవచ్చు.

మన వంతు రోడ్డు భద్రత నియమాలను పాటించి, సురక్షితమైన డ్రైవింగ్ చేసి, మన రహదారులను సురక్షితంగా ఉంచుని ప్రమాదాల రేటు తగ్గించడానికి పాటుపడదాం...

English summary
Read In Telugu: Seat Belt Alerts, Speed Warning Systems Mandatory For Cars From April 2019: Government
Story first published: Thursday, August 31, 2017, 14:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark