హైబ్రిడ్ వెర్షన్‌లో విడుదలైన హోండా సిటి: మైలేజ్ మరియు స్పెసిఫికేషన్స్
సిటి స్పోర్ట్ హైబ్రిడ్ ఇంటెలిజెంట్ డ్యూయల్ క్లచ్ డ్రైవ్(i-DCD) పరిజ్ఞానంతో హైబ్రిడ్ వెర్షన్‌ను సిటిని విడుదల చేసింది.
హోండా మోటార్స్ సిటి సెడాన్‌ను హైబ్రిడ్ వెర్షన్‌లో మలేషియా మార్కెట్లోకి విడుదల చేసింది. సిటి స్పోర్ట్ హైబ్రిడ్ ఇంటెలిజెంట్ డ్యూయల్ క్లచ్ డ్రైవ్(i-DCD) పరిజ్ఞానంతో హైబ్రిడ్ వెర్షన్‌ను సిటిని విడుదల చేసింది.
ఉత్తమ మైలేజ్ కోసం మలేషియాలో జాజ్ తర్వాత విడుదలైన రెండవ హైబ్రిడ్ కారు సిటి, జపాన్ తరువాత మలేషియాలో ఈ రెండు హైబ్రిడ్ కార్లు లభిస్తున్నాయి.

హోండా సిటి హైబ్రిడ్‌లో 1.5-లీటర్ సామర్థ్యం గల ఐ-విటిఇసి పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కలదు. లిథియమ్ అయాన్ బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే కంప్రెషర్ ఆధారంగా ఎలక్ట్రిక్ మోటార్ నడుస్తుంది.
Recommended Video


పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ సంయుక్తంగా 135బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు చేరుతుంది.

హోండా సిటి హైబ్రిడ్ మైలేజ్ 25.64 కిలోమీటర్లుగా ఉంది. మలేషియా హోండా లైనప్‌లోని సిటి మిడ్ లెవల్ వేరియంట్ "ఇ" మరియు టాప్ ఎండ్ వేరియంట్ "వి" మధ్య స్థానాన్ని సిటి హైబ్రిడ్ భర్తీ చేస్తుంది.

సిటి హైబ్రిడ్ ఇంటీరియర్‌లో 6.8-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. దీంతో పాటు టచ్ ప్యానల్ ఎయిర్ కండీషనింగ్, పగటి పూట వెలిగే లైట్లు, ఎల్ఇడి టెయిల్ లైట్లు మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు.

భద్రత పరంగా నాలుగు ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు వెహికల్ స్టెబిలిటి అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి ఫాగ్ ల్యాంప్స్, లెథర్ అప్‌హోల్‌స్ట్రే మరియు కర్టన్ ఎయిర్ బ్యాగులు ఇందులో అందివ్వలేదు. హోండా సిటి హైబ్రిడ్ ధర మలేషియాలో 89,200ఆర్ఎమ్‌లుగా ఉంది. మన కరెన్సీలో దీని ఆన్ రోడ్ ధర రూ. 13.40 లక్షలు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ మార్కెట్లోకి హోండా సిటి హైబ్రిడ్ సెడాన్ రావడం దాదాపు అసాధ్యమే. నూతన ట్యాక్స్ విధానంతో హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగింది. మరియు హైబ్రిడ్ కార్లను అభివృద్ది చేయడంలో కార్ల తయారీ సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించడంలేదు. హోండా సిటి హైబ్రిడ్ సెడాన్ భారతీయ రోడ్లను చేరుతుందనడంలో ఎలాంటి నమ్మకం లేదు.


Click it and Unblock the Notifications








