గుడ్ న్యూస్: హైబ్రిడ్ టెక్నాలజీతో జాజ్ మరియు సిటి సెడాన్ కార్లు

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సిటి సెడాన్ మరియు జాజ్ కార్లను హైబ్రిడ్ వెర్షన్‌లో విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

By Anil

సరసమైన హైబ్రిడ్ కార్లను అందిస్తున్న కార్ల కంపెనీల్లో మారుతి ముందుంది. సియాజ్ మరియు ఎర్టిగా కార్లను హైబ్రిడ్ టెక్నాలజీతో విక్రయిస్తోంది. హైబ్రిడ్ ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో వేడిని పెంచుతూ, జపాన్ దిగ్గజం హోండా రెండు హైబ్రిడ్ కార్లను ఇండియన్ మార్కెట్‌కు ఖాయం చేసింది.

హోండా నుండి రానున్న రెండు హైబ్రిడ్ కార్ల గురించి పూర్తి సమాచారం ఇవాళ్టి కథనంలో...

హైబ్రిడ్ కార్లు

హైబ్రిడ్ టెక్నాలజీ గల కార్లు తక్కువ ఇంధనంతో అధిక పవర్ మరియు మైలేజ్‌తో పాటు అతి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. పెట్రోల్ మరియు డీజల్ కార్లతో పోల్చుకుంటే వీటి వాడకం పర్యావరణానికి కాస్త మేలు జరుగుతుంది. ఇక మైలేజ్ ప్రియులు కూడా ఈ హైబ్రిడ్ కార్ల మోజులో పడుతున్నారు.

Recommended Video

[Telugu] 2017 Skoda Octavia RS Launched In India - DriveSpark
హైబ్రిడ్ కార్లు

వీటికి తోడు ప్రభుత్వాలు కూడా హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీ సంస్థలకు అధిక ప్రాదాన్యతనిస్తున్నాయి. దీంతో ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో హైబ్రిడ్ కార్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకునే విషయంలో కార్ల సంస్థలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.

హైబ్రిడ్ కార్లు

తాజాగా అందిన సమాచారం మేరకు, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి సిటి సెడాన్ మరియు జాజ్ కార్లను హైబ్రిడ్ వెర్షన్‌లో విడుదల చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిసింది.

హైబ్రిడ్ కార్లు

హోండా తమ జాజ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మరియు సిటి మిడ్ సైజ్ సెడాన్ కార్లను 2020 నాటికి సరికొత్త అప్‌డేట్స్‌తో విడుదల చేయనుంది. అదే సందర్భంలో వీటిని హైబ్రిడ్ పరిజ్ఞానంతో విడుదల చేసే ఆలోచనలో ఉంది.

హైబ్రిడ్ కార్లు

భారత్‌లో సరికొత్త ట్యాక్స్ విధానం జిఎస్‌టి అమల్లోకి వచ్చాక పెట్రోల్ మరియు డీజల్ కార్లతో పోల్చితే హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భారత్‌లో హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. కొన్ని సంస్థలు హైబ్రిడ్ కార్ల తయారీని కూడా నిలిపివేస్తున్నాయి. ఈ తరుణంలో హోండా తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యకరంగా ఉంది.

హైబ్రిడ్ కార్లు

హోండా సిటి మరియు జాజ్ హైబ్రిడ్ వేరియంట్ కార్లు ఇప్పటికే జపాన్ మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. రెండు కార్లలో కూడా 108బిహెచ్‌పి పవర్ మరియు 134ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు.

Trending On DriveSpark Telugu:

హైబ్రిడ్ కార్లు

ఈ పెట్రోల్ ఇంజన్ లిథియం అయాన్ బ్యాటరీ ద్వారా పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానమై ఉంటుంది. కేవలం ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే 29.5బిహెచ్‌పి పవర్ మరియు 36ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హైబ్రిడ్ కార్లు

సిటి మరియు జాజ్ హైబ్రిడ్ కార్లలోని ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్ సంయుక్తంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. జాజ్ మరియు సిటి హైబ్రిడ్ కార్లలో గల 7-స్పీడ్ ట్విన్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు అందుతుంది.

హైబ్రిడ్ కార్లు

ఈ హైబ్రిడ్ కార్లు లీటర్ పెట్రోల్‌కు గరిష్టంగా 25కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవని హోండా తెలిపింది. అయితే డీజల్ వేరియంట్లతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి. 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఉద్గార నియమాలను ఇవి పాటిస్తాయని కూడా వెల్లడించింది.

హైబ్రిడ్ కార్లు

ఎలక్ట్రిక్ కార్లను కాకుండా హైబ్రిడ్ కార్లను విడుదల చేయాలి హోండా తీసుకున్న నిర్ణయం దిగ్గజం ఆటో సంస్థలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎలాంటి ప్రణాళికలు లేకుండా 2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా సరిలేదు.

హైబ్రిడ్ కార్లు

ఎలాగో ఇండియన్స్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లను ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి వీటి కలయికలో ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానంతో హైబ్రిడ్ పరిజ్ఞానంతో వచ్చే మోడళ్లలను ఆదరిస్తారనే ఆలోచనతో జాజ్ మరియు సిటి హైబ్రిడ్ కార్లను విడుదలకు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైబ్రిడ్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మొక్కై వొంగనిది మానై వంగునా అన్నట్లుగా... ఒక్కో ప్రణాళిక ద్వారా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ, కార్ల తయారీ సంస్థలకు కొన్ని అవకాశాలను అందిస్తూ దశల వారీగా ఎలక్ట్రిక్ కార్లను వినియోగించేలా మార్పులు తీసుకురావాలని గానీ, ఎలాంటి ప్రణాళిక లేకుండా ఒక్కసారిగా మొత్తం వ్యవస్థ ఎలక్ట్రిక్ కార్ల మీదకు మళ్లాలంటే ఎలా సాధ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 28, 2017, 12:26 [IST]
English summary
Read In Telugu: Hybrid Variants Of Honda City And Jazz Confirmed For India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+