41,000 కార్లను రీకాల్ చేసిన హోండా: ఇందులో మీ కారు ఉందమే చూడండి
హోండా మోటార్స్ భారీ సంఖ్యలో కార్లను వెనక్కి పిలిచింది. ఎయిర్ బ్యాగులకు సంభందించిన లోపమే ఇందుకు ప్రధాన కారణం అని తేలింది. ఈ రీకాల్ లో మీ కార్లు కూడా ఉన్నాయోమే చెక్ చేసుకోండి.
జపాన్ కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా విభాగం దేశీయంగా సుమారుగా 41,580 కార్లను వెనక్కి పిలిచింది. టకాటా కార్పోరేషన్ తయారు చేసిన ఎయిర్ బ్యాగులను అమర్చడానికి రీకాల్ చేసినట్లు హోండా పేర్కొంది.

అంతర్జాతీయ రీకాల్‌లో భాగంగానే ఇండియాలోని ఈ యూనిట్లను రీకాల్ చేసింది. రీకాల్ కు ప్రధానం కారణం మీద దృష్టి సారిస్తే, టకాటా అమర్చిన ఎయిర్ బ్యాగుల్లో లోపం ఉన్న వాటిలో నూతన ఎయిర్ బ్యాగులను అందించాల్సి ఉంది.

2012 నుండి ఇప్పటి వరకు ఉత్పత్తయిన వాటిలో మొత్తం 41,580 కార్లను రీకాల్ చేసినట్లు హోండా తెలిపింది. అన్నింటికంటే హోండా సిటి 32,456 యూనిట్లు రీకాల్ అయ్యాయి. 7,265 యూనిట్ల జాజ్ హ్యాచ్‌బ్యాక్, 1,200 యూనిట్ల సివిక్ మరియు 659 యూనిట్ల అకార్డ్ కార్లు రీకాల్‌కు గురయ్యాయి.

ప్రమాదం సంభవించినపుడు ఎయిర్ బ్యాగులు విచ్చుకునేలా చేసే ఇన్ఫాయేటర్లలో లోపాన్ని గుర్తించడం జరిగింది. ఈ లోపాన్ని సరిచేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా రీకాల్ చేశాము. మరియు హోండా ప్రతినిధులు రీకాల్‌కు గురైన కార్ల యాజమానులను ఫోన్ ద్వారా సంప్రదిస్తాని పేర్కొన్నారు.

కస్టమర్లు రీకాల్‌కు గురైన తమ కార్లను దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ల వద్ద ఉచితంగా ఎయిర్ బ్యాగులను రీప్లేస్ చేసుకోవచ్చని కూడా హోండా తెలిపింది.

రీకాల్‌కు గురైన కార్ల వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ల జాబితాను హోండా తమ అధికారిక వెబ్‌సైట్లో మైక్రో సైట్ క్రియేట్ చేసింది. కస్టమర్లు తమ 17 అంకెల వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను హోండా సైట్ ద్వారా పోల్చి చూసుకోవచ్చు.

ఎయిర్ బ్యాగ్ జోడింపుతో స్విఫ్ట్ డిఎల్ఎక్స్ విడుదల: ప్రారంభ ధర రూ. 4.8 లక్షలు
ఇండియాకు ప్యూజో కార్లు
రెనో నుండి ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్


Click it and Unblock the Notifications








