డబ్ల్యూఆర్-వి ప్రొడక్షన్‌ పెంచిన హోండా మోటార్స్: విపరీతంగా పెరుగుతున్న డిమాండ్

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ తమ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ విడుదలతో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది.

By Anil

జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హోండా మోటార్స్ తమ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ విడుదలతో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తోంది. సిటి సెడాన్ కారు తర్వాతా హోండాకు బెస్ట్ సెల్లింగ్ కారుగా డబ్ల్యూఆర్-వి నిలిచింది.

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా మోటార్స్ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్‌ను మార్చి 2017 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. విడుదల సమయం నుండి ఇప్పటి వరకు డబ్ల్యూఆర్-వి మీద 23,000 బుకింగ్స్ నమోదయ్యాయి, వాటిలో ఇప్పటి వరకు 16,000 యూనిట్లను డెలివరీ ఇచ్చింది.

Recommended Video

2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా డబ్ల్యూఆర్-వి

విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఎస్‌యూవీలకు కౌంటర్‌గా డబ్ల్యూఆర్-వి ని విడుదల చేసింది. అయితే కాంపాక్ట్ ఎస్‌యూవీలో కాకుండా కాంపాక్ట్ క్రాసోవర్ ఎస్‌యూవీ సెగ్మంట్లోకి విడుదలైంది.

హోండా డబ్ల్యూఆర్-వి

జూన్ విక్రయాల్లో దేశవ్యాప్తంగా సిటి సెడాన్ 5,187 యూనిట్లు అమ్ముడుపోగా, డబ్ల్యూఆర్-వి 4,243 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి. హోండా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో సెకండ్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది.

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా ప్రస్తుతం నెలకు 3,400 యూనిట్ల వరకు డబ్ల్యూఆర్-వి లను ఉత్పత్తి చేస్తోంది. అయితే డిమాండ్ తగ్గిన సంఖ్యలో ఉత్పత్తి చేసేందుకు నెలకు 5,000 యూనిట్లకు ప్రొడక్షన్ పెంచినట్లు హోండా ప్రకటించింది.

హోండా డబ్ల్యూఆర్-వి

సిటి సెడాన్ తర్వాత అత్యుత్తమ ప్రీమియమ్ ఫీచర్లు గల మోడల్ డబ్ల్యూఆర్-వి అని చెప్పవచ్చు, ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డ్రైవర్ సైడ్ కూల్ కప్ హోల్డర్/స్మార్ట్ ఫోన్ హోల్డర్, డ్రైవర్ సైడ్ ఆర్మ్ సెట్ లతో పాటు స్టాండర్డ్ ఫీచర్లుగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మరియు మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ మాట్లాడుతూ, " డబ్ల్యూఆర్-వి మీద ప్రస్తుతం రెండు నెలలు వెయింట్ పీరియడ్ ఉంది, వెయిటింగ్ పీరియడ్ తగ్గించి, డెలివరీలను వేగవంతం చేయడానికి ప్రొడక్షన్ పెంచుతున్నట్లు పేర్కొన్నాడు."

హోండా డబ్ల్యూఆర్-వి

మరో రెండు నెలలో దేశవ్యాప్తంగా పండుగ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వెయిటింద్ పీరియడ్ తగ్గించడానికి ప్లాన్ చేస్తున్నారు. పండుగ సీజన్‌లో కార్లు మరియు బైకుల సేల్స్ విపరీతంగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే ప్రొడక్షన్‌ను వేగవంతం చేస్తే పండుగలు ప్రారంణభమయ్యే నాటికి డబ్ల్యూఆర్-వి సేల్స్ పెంచుకోవచ్చని జ్ఞానేశ్వర్ తెలిపారు.

హోండా డబ్ల్యూఆర్-వి

హోండా ఇండియా అభివృద్ది చేసిన తొలి మోడల్ డబ్ల్యూఆర్-వి క్రాసోవర్ ఎస్‌యూవీ. హోండా ఆర్అండ్‌డి కంపెనీ లిమిటెడ్ సహాయంతో హోండా ఆర్‌అండ్‌డి ఇండియా అభివృద్ది చేసింది.

హోండా డబ్ల్యూఆర్-వి

సాంకేతికంగా హోండా డబ్ల్యూఆర్-విలో పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇందులో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 89బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 99బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా డబ్ల్యూఆర్-వి

పెట్రోల్ వేరియంట్ డబ్ల్యూఆర్-వి 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మరియు డీజల్ వేరియంట్ డబ్ల్యూఆర్-వి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో లభిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డిజైన్, ఫీచర్లు మరియు భద్రత పరంగా మరియు శక్తివంతమైన ఇంజన్‌లతో బెస్ట్ క్రాసోవర్‌గా నిలిచింది. సిటి సెడాన్ తరహాలో జపాన్ దిగ్గజం హోండా మోటార్స్‌కు డబ్ల్యూఆర్-వి ఎస్‌యూవీ మరో పెద్ద సక్సెస్ అని చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: WR-V The Next Big Winner For Honda In India
Story first published: Saturday, July 22, 2017, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X