హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు: కేవలం నెల రోజులు మాత్రమే

హ్యుందాయ్ ఇండియన్ కస్టమర్ల కోసం హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్ పేరుతో అద్బుతమైన స్కీములు, కళ్లు చెదిరే ఆఫర్లు మరియు గొప్ప తగ్గింపును ప్రకటించింది.

By Anil

ప్రతి సంవత్సరానికి చివరగా ఉండే డిసెంబర్ మాసం ద్వారా కార్ల తయారీ సంస్థలు ప్రతి ఏటా ఇయర్ ఎండ్ ఆఫర్లు ప్రకటిస్తాయి. డిసెంబర్ నెల మొత్తం అందుబాటులో ఉండేలా ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. అందులో ఒకటి హ్యుందాయ్ మోటార్స్.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

భారతదేశపు రెండవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ ఇండియన్ కస్టమర్ల కోసం హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్ పేరుతో అద్బుతమైన స్కీములు, కళ్లు చెదిరే ఆఫర్లు మరియు గొప్ప తగ్గింపును ప్రకటించింది. హ్యుందాయ్ ఇయర్ ఎండ్ ఆఫర్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో...

Recommended Video

Tata Motors Delivers First Batch Of Tigor EV To EESL - DriveSpark
హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

హ్యుందాయ్ ఇయాన్

హ్యుందాయ్ తమ ఎంట్రీ లెవల్ కారు ఇయాన్ మీద కూడా ఆఫర్లు ప్రకటించింది. ఇయాన్ మీద గరిష్టంగా రూ. 65,000 ల వరకు లాభాలను ప్రకటించింది. మరియు ప్రత్యేక ఆఫర్ క్రింది దీనిని రూ. 2.95 లక్షలకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

సరికొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్ వేరియంట్ మీద రూ. 80,000 ల వరకు మరియు డీజల్ వేరియంట్ మీద రూ. 90,000 ల వరకు లాభాలను ప్రకటించింది. మరియు దీని రూ. 4.29 లక్షల ప్రత్యేక ధరతో సొంతం చేసుకోవచ్చు.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

హ్యుందాయ్ ఎక్సెంట్

హ్యుందాయ్ తమ సబ్-4 మీటర్ల ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ మీద పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లపై గరిష్టంగా రూ. 60,000 ల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. అంతే కాకుండా ప్రత్యేకమైన ధరతో ఎక్సెంట్ సెడాన్ కారును రూ. 5.29 లక్షలకే కొనుగోలు చేయవచ్చు.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

హ్యుందాయ్ ఐ20 మరియు ఐ20 యాక్టివ్

హ్యుందాయ్ మోటార్స్ తమ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లయిన ఐ20 మరియు ఐ20 యాక్టివ్ కార్ల మీద రూ. 55,000ల వరకు లాభాలను అందిస్తోంది.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

హ్యుందాయ్ ఎలంట్రా మరియు టుసాన్

హ్యుందాయ్ ప్రీమియమ్ మోడళ్లు ఎలంట్రా సెడాన్ మరియు టుసాన్ ప్రీమియమ్ ఎస్‌యూవీ రెండింటిలో ఉన్న పెట్రోల్ మీద డీజల్ వేరియంట్ల మీద గరిష్టంగా రూ. 70,000 ల వరకు ప్రయోజనాలను ప్రకటించింది.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు, హ్యుందాయ్ అదనంగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్న వేరియంట్ల ఎంపిక మీద 10,000 రుపాయల డిస్కౌంట్ కలదు. అదనంగా, ఆకర్షణీయమైన ఎక్స్‌చ్ఛేంజజ్ ఆఫర్లు మరియు క్యాష్ బ్యాక్ లాభాలు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ డిసెంబర్ ఆఫర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ డిసెంబర్ డిలైట్ ఆఫర్లు చాలా బాగున్నాయి కదా... సాధారణ సందర్భాల్లో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయాలని చూస్తే, బహుశా ఈ ఆఫర్లు లభించకపోవచ్చు. కాబట్టి డిసెంబర్ 2017 ముగిసేలోపే మీకు సమీపంలో ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌ను సందర్శించి, మీకు నచ్చిన మోడల్‌ను ఈ పరిమిత కాలపు ఆఫర్‌కు కాలంచెల్లేలోపే ఎంచుకోండి.

More from DriveSpark

Article Published On: Saturday, December 9, 2017, 9:58 [IST]
English summary
Read In Telugu: Hyundai Cars December Offers — Only For A Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+