హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్ వేరియంట్ రివీల్

హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా ఎస్‌యూవీని క్రెటా స్పోర్ట్ వేరియంట్లో ఆవిష్కరించింది.

By Anil

దక్షిణ కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ తమ క్రెటా ఎస్‌యూవీని క్రెటా స్పోర్ట్ వేరియంట్లో ఆవిష్కరించింది.

ప్రస్తుతానికి క్రెటా స్పోర్ట్ వేరియంట్‌ను బ్రెజిల్ మార్కెట్ కోసమే ఆవిష్కరించినట్లు హ్యుందాయ్ ప్రతినిధులు తెలిపారు.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

క్రెటా ఎస్‌యూవీలో అగ్రెసివ్ లుక్ కోసం ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో పాటు చాలా చోట్ల బ్లాక్ అవుట్ ఫినిషింగ్ అందివ్వడం జరిగింది. సాధారణ క్రెటాతో పోల్చుకుంటే ఎంతో భిన్నంగా కనబడే సరికొత్త క్రెటా స్పోర్ట్ వేరియంట్ బ్రెజిల్ విపణిలో ఆవిష్కరించబడింది.

Recommended Video

2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

హ్యుందాయ్ క్రెటా ఫ్రంట్ డిజైన్‌లో గ్లోజీ బ్లాక్ గ్రిల్ బార్డర్, కొత్తగా డిజైన్ చేయబడిన ఎయిర్ డ్యామ్ గ్రిల్ మరియు గ్లాస్ బ్లాక్ స్కిడ్ ప్లేట్లు ఉన్నాయి. సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్లాక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు రీడిజైన్ చేయబడిన 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

క్రెటా స్పోర్ట్ రియర్ డిజైన్‌లో కూడా గ్లాస్ బ్లాక్ స్కిడ్ ప్లేట్లు, సరికొత్త రియర్ స్పాయిలర్ కూడా బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఎక్ట్సీరియర్ మీద వీటితో పాటు షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రెయిల్స్ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

బ్రెజిల్ విపణిలో ఆవిష్కరించబడిన క్రెటా స్పోర్ట్ వేరియంట్లో సాంకేతికంగా 2-లీటర్ కెపాసిటి గల ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ కలదు. పెట్రోల్‌తో నడిస్తే 156బిహెచ్‌పి మరియు డీజల్‌తో నడిస్తే 166బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. భద్రత పరంగా ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా స్పోర్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్టాండర్డ్ క్రెటాతో పోల్చుకుంటే ఉన్న పోలికను వ్యక్తపరిచేందుకు ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. సరికొత్త క్రెటా స్పోర్ట్ నవంబర్ 2017 నుండి బ్రెజిలో మార్కెట్లో విక్రయాలకు వెళ్లనుంది. అయితే, అంతర్జాతీయ విపణిలో దీని విడుదల గురించి హ్యుందాయ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

More from DriveSpark

Article Published On: Saturday, September 30, 2017, 13:35 [IST]
English summary
Read In Telugu: Hyundai Reveals Creta Sport Variant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+