బాలెనో పై సమరానికి సిద్దమైన హ్యుందాయ్ ఎలైట్ ఐ20

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తమ ఎలైట్ ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో పలుమార్లు ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌కు రహస్యంగా రహదారి పరీక్షలు నిర్వహించింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

తమిళనాడులో హ్యుందాయ్ తమ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌ను రహస్యంగా పరీక్షిస్తుండగా ఓ ఆటోమొబైల్ మీడియా కంటబడింది. దీని డిజైన్ లక్షణాలను ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేకుండా ముందు మరియు వెనుక వైపున నల్లటి కవర్‌తో కప్పేయడం జరిగింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఎలైట్ ఐ20 ఫ్రంట్ డిజైన్‌లో పూర్తి స్థాయిలో నూతన ఫ్రంట్ గ్రిల్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యనే హ్యుందాయ్ అప్‌గ్రేడ్ చేసిన గ్రాండ్ ఐ10 మరియు ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్‌లలో వచ్చిన ఫ్రంట్ గ్రిల్‌ తరహాలోనే రానుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఫ్రంట్ బంపర్ మరియు హెడ్ లైట్లలో కొన్ని ప్రధానమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రక్క మరియు రూఫ్ టాప్ డిజైన్‌లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఫేస్‌లిఫ్ట్ ఎలైట్ ఐ20 కి చెందిన రహస్య ఫోటోలను గమనిస్తే, ఇందులో సరికొత్త డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ గుర్తించవచ్చు. అయితే టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే రానున్నాయి. వెనుక వైపు డిజైన్‌లోని టెయిల్ ల్యాంప్ క్లస్టర్ స్వల్ప మార్పులు జరిగాయి.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

వెనుక వైపు బంపర్ మీద మధ్యలో ఉన్న నెంబర్ ప్లేట్‌ను ఇరువైపులా ఉన్న టెయిల్ లైట్లకు మధ్యలో అమర్చారు. ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులకు తావు లేదని తెలిసింది. అయితే సరికొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానున్నట్లు సమాచారం.

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ ఇది వరకే ఉన్న ఇంజన్ వేరియంట్లలో రానుంది. ప్రస్తుతం ఉన్న 1.2- మరియు 1.4-లీటర్ పెట్రోల్, 1.4-లీటర్ డీజల్ ఇంజన్‌లతో పాటు ఇది 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్‌తో కూడా వచ్చే అవకాశం ఉంది.

English summary
Read In Telugu To Know More Hyundai Elite i20 Facelift Spotted

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark