హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధరలు ఎంత వరకు తగ్గాయో తెలుసా ?

జిఎస్‌టి అమలైన తరువాత ధరలు తగ్గింపు ప్రకటించిన మరో కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్. జిఎస్‌టికి అనుగుణంగా తమ అన్ని కార్ల ధరల సవరణ చేపట్టింది. గరిష్టంగా 5.9 శాతం వరకు ధరలు తగ్గించింది.

By Anil

జిఎస్‌టి అమలైన తరువాత ధరలు తగ్గింపు ప్రకటించిన మరో కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్. జిఎస్‌టికి అనుగుణంగా తమ అన్ని కార్ల ధరల సవరణ చేపట్టింది. గరిష్టంగా 5.9 శాతం వరకు ధరలు తగ్గించింది. ఈ తగ్గింపులో వివిధ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద తగ్గిన ధరలు

హ్యుందాయ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్ మీద జిఎస్‌టి అనుగుణంగా ధర తగ్గింది. జిఎస్‌టికి ముందు గ్రాండ్ ఐ10 ధరల శ్రేణి రూ. 4.59 నుండి 7.37 లక్షల మధ్య ఉండేది. జిఎస్‌టి అమలుతో గ్రాండ్ ఐ10 ధరల శ్రేణి రూ. 4.55 నుండి 7.3 లక్షల మధ్య ఉంది. నూతన ట్యాక్స్ విధానం మేరకు రూ. 4,000 నుండి రూ. 7,000 ల వరకు ధర తగ్గింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద తగ్గిన ధరలు

హ్యుందాయ్ ఈ మధ్యనే గ్రాండ్ ఐ10 లో స్వల్ప మార్పులు చేసింది. ఫ్రంట్ డిజైన్ మార్పులతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను జోడించింది. ప్రస్తుతం గ్రాండ్ ఐ10 పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద తగ్గిన ధరలు

గ్రాండ్ ఐ10 లోని 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద తగ్గిన ధరలు

అదే విధంగా 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిని కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మీద తగ్గిన ధరలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ జిఎస్‌టి ప్రతిఫలాలను కస్టమర్లకు అందిస్తోంది. గ్రాండ్ ఐ10 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక మంచి సమయం. జూన్ నెల విక్రయాల్లో హ్యుందాయ్ ఆశించిన ఫలితాలు సాధించలేదు. కాబట్టి రానున్న కాలంలో అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 12, 2017, 11:13 [IST]
English summary
Read In Telugu: Hyundai Grand i10 Prices Drop After GST
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+