ఐ20 స్పోర్ట్ కారును ఆవిష్కరించిన హ్యుందాయ్
2017 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో వేదిక మీద హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త ఐ20 స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది.
ఇండోనేషియాలోని జకార్తాలో జరుగుతున్న 2017 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో వేదిక మీద హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త ఐ20 స్పోర్ట్స్ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించింది.

ఐ20 కారులో స్పోర్టివ్ ఫీల్‌ను కలిగించేందుకు ఎక్ట్సీరియర్ మీద అనేక కాస్మొటిక్ మార్పులు చేసి ఐ20 స్పోర్ట్ కారును ఇండోనేషియాలో జరిగిన ఆటో షో వేదిక మీద ప్రదర్శించింది. సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు.
Recommended Video


హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్ ముందు వైపున ఫాగ్ ల్యాంప్ చుట్టూ పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. ఎరుపు రంగు పూత పూయబడిన ఫ్రంట్ బంపర్, సైడ్ స్కర్ట్స్, బ్లాక్ వినైల్ ఫనిష్ గల డోర్లు, సిల్వర్ ఫాక్స్ డిఫ్యూసర్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న రూఫ్ స్పాయిలర్ ఇందులో ప్రధానంగా గుర్తించవచ్చు.

హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్ ఇంటీరియర్‌లో 8-అంగుళాల పరిమాణం ఉన్న టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ ఆధారిత బటన్స్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ అడ్జెస్ట్‌మెంట్ గల స్టీరింగ్ మరియు పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సాంకేతికంగా హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్ కారులో 1.4-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 98బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

రెగ్యులర్ వెర్షన్ ఐ20 కారుతో పోల్చుకుంటే ఐ20 స్పోర్ట్ పనితీరులో ఎలాంటి మార్పు లేదు. కస్టమర్లకు స్పోర్టివ్ ఫీల్‌ను అందించేందుకు ఐ20 స్పోర్ట్‌ను ఆవిష్కరించింది. అయితే పర్ఫామెన్స్ వేరియంట్ కోసం హ్యుందాయ్ వారి ఎన్ ఫ్లాట్‌ఫామ్ మీద సరికొత్త ఐ20 కారును అభివృద్ది చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియాలో అప్‌డేటెడ్ ఐ20 కారును హ్యుందాయ్ పరీక్షిస్తోంది. దీనిని మరికొన్ని నెలల్లో విడుదల చేయనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్ కారును ఇండియాలో విడుదల చేసే విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలైట్ ఐ20 కారులో అదనపు యాక్ససరీ క్రింద స్పోర్ట్ కిట్‌ను అందించే అవకాశం ఉంది. డిజైన్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి, బాడీ కిట్ ద్వారా స్పోర్టివ్ ఫీల్ తెప్పించవచ్చు.


Click it and Unblock the Notifications








