హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్ రివీల్: ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి!

ఐ30 ఎన్ హాచ్‌బ్యాక్‌ను పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వెర్షన్‌లో విడుదలకు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇప్పుడు సౌత్ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఐ30 ఫాస్ట్‌బ్యాక్ కారును రివీల్ చేసింది.

By Anil

ఐ30 ఎన్ హాచ్‌బ్యాక్‌ను పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వెర్షన్‌లో విడుదలకు సిద్దం చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇప్పుడు సౌత్ కొరియా ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం ఐ30 ఫాస్ట్‌బ్యాక్ కారును రివీల్ చేసింది. ఐదు డోర్ల వెర్షన్‌లో ఇది విక్రయాలకు సిద్దం కానుంది.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్ కారు వచ్చే ఏడాది నుండి అంతర్జాతీయ విపణిలోకి అమ్మకాల్లో ఉండనుంది. ఐ30 హ్యాచ్‌బ్యాక్, ఐ30 ఎస్టేట్ మరియు ఐ30 వ్యాగన్ కార్లతో పాటే ఇది కూడా లభించనుంది.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

డిజైన్ విషయానికి వస్తే, ఐ30 హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చినపుడు భిన్నంగా ఉండేందుకు విభిన్న డిజైన్ లక్షణాలతో దీని ఫ్రంట్ డిజైన్‌ను రూపొందించడం జరిగింది. లగ్జరీ ఫీల్ కలిగే విధంగా రియర్ డిజైన్‌ను ఆవిష్కరించారు.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

హ్యుందాయ్‌లోని ఇతర ఐ30 మోడళ్ల తరహాలోని ఈ ఐ30 ఫాస్ట్‌బ్యాక్ ఇంటీరియర్ కలదు, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేయగల 8-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అంతే కాకుండా ఆప్షనల్‌గా వైర్ లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

సాంకేతికంగా హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్‌ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభించనుంది. ఇందులోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న మూడు సిలిండర్ల టుర్భో ఛార్జ్‌డ్ పెట్రోల్ 118బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

అదే విధంగా 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 138బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ఐ30 ఫాస్ట్‌బ్యాక్ ను స్టాండర్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆప్షనల్‌ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్‌లో భారీ సేఫ్టీ ఫీచర్లను అందించింది. ఆప్షనల్ పెడస్ట్రేన్ డిటెక్షన్ ఫీచర్ గల అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, అడ్వాన్స్‌డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ మరియు హై బీమ్ అలర్ట్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అద్బుతమైన డిజైన్‌లో హ్యందాయ్ ఐ30 ఫాస్ట్‌బ్యాక్ అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ కూపే కారును గుర్తుకుతెస్తోంది. దీని ఆవిష్కరణ సమయంలో ఇండియాలో విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే హ్యుందాయ్ ఫాస్ట్‌బ్యాక్‌ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai i30 Fastback Revealed — Is India On The Cards?
Story first published: Wednesday, July 19, 2017, 12:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X