ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ

Written By:

ఆటోమోటివ్ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి ఉన్న దాదాపు అన్ని అవకాశాలను వినియోగించుకుంటాయి. స్పెషల్ ఎడిషన్‌లతో వీలైనంత వరకు ఎక్కువ మందిని కస్టమర్లను చేరుకునేలా ప్రమోట్ చేస్తుంటాయి. అందుకు ఉదాహరణ ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో ఆవిష్కృతమైన హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ.

ఐరన్ మ్యాన్ ప్రేరిత లక్షణాలతో స్పెషల్ ఎడిషన్ క్రింద కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్‌ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్

ఐరన్ మ్యాన్ చిత్రం ఆధారంగా, ఐరన్ మ్యాన్ సూట్ డిజైన్ లక్షణాలతో దీనిని డిజైన్ చేశారు. మరియు ఎక్ట్సీరియర్ పెయింట్ మరియు స్పెషల్ ఎడిషన్ లక్షణాలన్నీ కూడా ఐరన్ మ్యాన్‌ సూట్‌కు చాలా దగ్గరిగా ఉంటాయి.

హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్

డిజైన్ మరియు బాడీ పెయింట్ పరంగానే కాకుండా ఈ స్పెషల్ ఎడిషన్ హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్‌లో అత్యాధునికి భద్రత మరియు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఫీచర్లున్నాయి. సాధారణ కోనా ఎస్‌యూవీ కన్నా 40ఎమ్ఎమ్ వరకు ఎక్కువ విశాలంగా ఉంది, 19-అంగుళాల పరిమాణం ఉన్న చక్రాలకు ఆఫ్ రోడ్ టైర్లను అందివ్వడం జరిగింది.

హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్

హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ మీద మ్యాట్ గ్రే పెయింట్, చక్రాలు మరియు బ్యానెట్ మీద ఎరుపు మరియు బంగారు రంగుల్లో పూయబడిన పూత మరియు ప్రకాశవంతమైన రూఫ్ టాప్ కలదు. సైడ్ డోర్లు మరియు అల్లాయ్ వీల్స్ మధ్యలో ఐరన్ మ్యాన్ లోగో కలదు.

హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్

అంతర్జాతీయ విపణిలోకి ఆవిష్కరించిన అనంతరం, ఈ ఐరన్ మ్యాన్ ఎడిషన్ కోనా ఎస్‌యూవీని దక్షిణ కొరియాలోని సియోలో నగరంలో ఉన్న హ్యుందాయ్ మోటార్ స్టుడియోలో నెల రోజుల పాటు ప్రదర్శనకు ఉంచనున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐరన్ మ్యాన్ అభిమానులను హ్యుందాయ్ కోనా ఐరన్ మ్యాన్ ఎడిషన్ ఎస్‌యూవీ ఆకట్టుకోవడం గ్యారంటీ. అయితే బ్యాడ్ న్యూస్ ఏమిటంటే, హ్యుందాయ్ ఈ ఐరన్ మ్యాన్ ఎడిషన్ కోనా ప్రొడక్షన్ చేయకపోవడం.

English summary
Read In Telugu Hyundai Reveals Iron Man Edition Of The Hyundai Kona SUV
Story first published: Thursday, June 15, 2017, 13:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark