కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ ఫోటోలను ఆవిష్కరించిన హ్యుందాయ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ టక్సన్ ఎస్‌యూవీని విడుదల చేసిన అనంతరం, తమ తరువాత ఉత్పత్తిగా కోనా క్రాసోవర్ ఎస్‌యూవీని అభివృద్ది చేసి విడుదలకు సిద్దం చేస్తోంది.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఉత్పత్తుల లైనప్‌లో ఉన్న టక్సన్ ఎస్‌యూవీకి దిగువ స్థానాన్ని భర్తీ చేయనున్న కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్ ఫోటోలను విడుదల చేసింది. హ్యుందాయ్ వద్ద ఉన్న ప్రీమియమ్ హ్యాచ్‌హబ్యాక్ ఐ20 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

కోనా ఎస్‍‌‌యూవీ ఎక్ట్సీరియర్ ఫోటోలను పరిశీలిస్తే హ్యుందాయ్ వద్ద ఉన్న మరే ఇతర ఉత్పత్తుల్లో ఈ తరహా డిజైన్ ఎలిమెంట్లు లేకపోవడాన్ని గమనించవచ్చు. ఫ్రంట్ డిజైన్‌లో ప్రత్యేకించి అర్ధ సమాంతర చతుర్భుజాకారంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ మరియు రెండు భాగాలుగా ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

ఈ హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ అంతర్జాతీయ విపణిలో ఉన్న నిస్సాన్ జూక్ ఎస్‌యూవీకి ప్రత్యక్ష పోటీనివ్వనుంది. నిస్సాన్ జూక్ ఎస్‌యూవీ తరహాలోనే ముందు వైపున ఉబ్బెత్తుగా మరియు ఎత్తైన ఆకృతిని కలిగి ఉంది.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

ఫ్రంట్ హెడ్ లైట్లు చాలా సన్నగా, వాలుగా అమర్చడం జరిగింది. ఇందులో ఉన్న పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల రూపకల్పన చాలా డిఫరెంట్‌గా ఉంది. బానెట్ డోర్ ముందు వైపు అంచున, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ నుండి ఫ్రంట్ గ్రిల్ వరకు వాలుగా ఎల్ఇడి లైట్లను అమర్చారు.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా ఎస్‌యూవీ ప్రక్కవైపు డిజైన్ మరింత ఆకర్షణీయంగా ఉంది. వెనుక టెయిల్ లైట్ల నుండి ప్రారంభమయ్యి, డోర్ల మీదుగా వచ్చి ఫ్రంట్ టైర్ వద్ద క్రిందకు వాలిపోయిన క్యారెక్టర్ లైన్లు, పెద్ద పరిమాణంలో ఉన్న వీల్ ఆర్చెస్, ముందు నుండి వైనుక వైపుకు స్వల్ప వాలును కలిగి ఉన్న రూఫ్ టాప్, ఈ రూఫ్ టాప్‌కు అనుసంధానంగా చివర్లో స్పాయిలర్ కలదు.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ పూర్తిగా డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లో రానుంది, అయితే రూఫ్ మరియు డోర్లను కలిపే పిల్లర్లు మాత్రమే బ్లాక్ కలర్‌లో రానున్నాయి. మరియు ఎస్‌యూవీకి చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ కలదు.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

వెనుక వైపు డిజైన్ విషయానికి వస్తే, ముందు వైపున్న హెడ్ ల్యాంప్ డిజైన్‌కు పోటీపడే విధంగా రెండుగా చీలిపోయిన టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అమరిక కలదు. రియర్ ఇండికేటర్లను చిన్న పరిమాణంలో బంపర్‌లో అమర్చారు. టెయిల్ లైట్ క్లస్టర్‌లోనే ప్రకాశవంతమైన కాంతినివ్వగల బ్రేక్ లైట్‌కు స్థానం కల్పించారు.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

సాంకేతికంగా హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీలో ప్రస్తుతం అంతర్జాతీయ విపణిలో ఉన్న ఐ30 హ్యాచ్‌బ్యాక్ ఉన్న 1.0-లీటర్ మరియు 1.4-లీటర్ టుర్బో పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో పాటు 1.6-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ కోనా క్రాసోవర్ ఎస్‌యూవీ

ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ ఆప్షన్‌తో లభిస్తే హ్యుందాయ్ కోనా క్రాసోర్ ఎస్‌యూవీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. హ్యాచ్‌బ్యాక్ నుండి ఎస్‌యూవీల వరకు డిజైన్‌లో మార్పులు చేసిన నూతన శ్రేణి ఉత్పత్తులను అభివృద్ది చేసే ఆలోచనల్లో హ్యుందాయ్ ఉంది. అయితే వీటిలో కోనా ఎస్‌యూవీ లేదు... ఇండియాలో దీని విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు.

English summary
Read In Telugu Hyundai Kona Official Images Reveal Exterior Design
Story first published: Thursday, June 8, 2017, 11:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark