స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్‌ను విడుదల చేసిన హ్యుందాయ్: ధర రూ. 3.88 లక్షలు
ఎక్ట్సీరియర్ మీద స్వల్ప మార్పులు చేసి తమ ఇయాన్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్ట్స్ ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్ ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఇతర వివరాల కోసం...
దేశీయ హ్యుందాయ్ లైనప్‌లోకి హ్యుందాయ్ మోటార్స్ ఇయాన్ కారును స్పోర్ట్స్ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో కాస్మొటిక్ మార్పులకు గురైన ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 3.88 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్ వేరియంట్లు మరియు ధరలు
ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్ ఎరా ప్లస్ మరియు మ్యాగ్నా ప్లస్ ట్రిమ్ వేరియంట్లలో లభిస్తోంది.
- ఎరా ప్లస్ స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్ ధర రూ. 3.88 లక్షలు
- సాలిడ్ మరియు మెటాలిక్ స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్ ధర రూ. 3.92 లక్షలు
- మ్యాగ్నా ప్లస్ వేరియంట్ ధర రూ. 4.14 లక్షలు
- సాలిడ్ మెటాలిక్ మ్యాగ్నా ప్లస్ వేరియంట్ ధర రూ. 4.18 లక్షలు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

సరికొత్త స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్‌లో రూఫ్ రెయిల్స్ మరియు కారుకు ఇరువైపులా బాడీ మోల్డింగ్ గ్రాఫిక్స్ కలవు. ఇక కారు ఇంటీరియర్‌లో 6.2-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

ఇందులో డ్యూయల్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ అందివ్వడం జరిగింది. అయితే స్టీరింగ్ వీల్ ఆధారిత నియంత్రికలను డోర్ ప్యానల్స్ మీద అందివ్వడం జరిగింది. ఈ మార్పులు మినహాయిస్తే స్పోర్ట్స్ ఎడిషన్ ఇయాన్‌లో ఎటువంటి నూతన మార్పులు చోటుచేసుకోలేదు.

సాంకేతికంగా హ్యుందాయ్ మోటార్స్ వద్ద ఉన్న 0.8-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను ఇయాన్ స్పోర్ట్స్ ఎడిషన్‌లో అందివ్వడం జరిగింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 55బిహెచ్‌పి పవర్ మరియు 75ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. అయితే దీనిని కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లో మాత్రమే ఎంచుకోగలరు.

మారుతి సుజుకి ఆల్టో800 మరియు రెనో క్విడ్ ల నుండి ఎదురవుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ మోటార్స్ తమ ఇయాన్ హ్యాచ్‌బ్యాక్‌ను స్పోర్ట్స్ ఎడిషన్‌లో విడుదల చేసింది.


Click it and Unblock the Notifications